
కానీ బిగ్ బాస్ మాత్రం షాకింగ్ నిర్ణయం తీసుకుని ఇనాయను ఎలిమినేట్ చేయడం జరిగింది. కానీ వాస్తవంగా గత వారమే డబుల్ ఎలిమినేషన్ ఉండాల్సింది.. ఎందుకంటే ఉన్నది ఒకేవారం కాబట్టి... బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఫైనల్ వీక్ కు కేవలం అయిదు మంది మాత్రమే వెళతారు. కానీ హౌస్ లో ఇనాయ ఎలిమినేట్ అయ్యాక కూడా ఆరు మంది ఉండడంతో ప్యాట్రన్ ఏమైనా మార్చారా అంటూ షాక్ లో ఉన్న ఫ్యాన్స్ కు నాగార్జున మరో షాక్ ఇచ్చారు. ఈ వారం గురువారం రోజున మరో ఎలిమినేషన్ ఉండనుందని కుండబద్దలు కొట్టారు. బుధవారం రాత్రి వరకు వచ్చే ఓట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని గురువారం ఎలిమినేషన్ ఉంటుందని తెలిపాడు.
దీనితో హౌస్ లో ఉన్న ఆరుగురిలో ఒక్క శ్రీహన్ మినహా మిగిలిన సభ్యులకు గుండెల్లో దడ పుడుతోంది అని చెప్పాలి. అయితే గత వారం నామినేషన్ కు వచ్చి సేవ్ అయిన కీర్తి లేదా శ్రీ సత్య లలో ఒకరు ఎలిమినేట్ కావచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మరి అస్సలు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.