తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ, సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారానే మంచి పాపులర్ అయ్యారు. అంతే కాకుండా ఎన్నో షోలకు హోస్టుగా కూడా వ్యవహరించారు.ప్రస్తుతం ఇద్దరు కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. దీంతో బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షో కి గుడ్ బై కూడా చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో అనసూయ సైతం ఎప్పుడూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండీగా నిలుస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు పలు విమర్శలు ట్రోల్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి అనసూయకు.


ఇక అసలు విషయంలోకి వెళ్తే అనసూయ,సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యే విధంగా మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుధీర్ పైన ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టెంట పెను దుమారాన్ని రేపేలా చేస్తున్నాయి. సుడిగాలి సుధీర్ అనసూయ కలిసి ఇటీవల వాంటెడ్ పండుగాడు చిత్రంలో నటించారు తాజాగా ఒక టీవీ యాంకర్ తో సుధీర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది అంటూ అనసూయని ప్రశ్నించగా ఈ విషయంపై అనసూయ సెటైర్ వేయడం జరిగింది.

సుధీర్ నాకు జూనియర్ ఆ విషయం మీకు తెలియదా అంటూ అక్కడున్న వారి పైన కాస్త రాష్ గానే రియాక్ట్ అయ్యిందని ఈ వీడియోలో చూస్తే అర్థమవుతోంది. ఆ తరువాత అనసూయ, సుధీర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారని నా నుంచి కూడా సుధీర్ చాలా విషయాలు నేర్చుకున్నారని తెలియజేసింది. దీంతో ఈ విషయం విన్న సుధీర్ అభిమానులు అనసూయ పైన కోప్పడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా అనసూయకు ఇంత ఆటిట్యూడ్ ఎందుకు ఇలా రెచ్చిపోయి మాట్లాడింది అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: