
బిగ్ బాస్ షో ద్వారా అందరిని ఆకట్టుకున్న దివి అప్పటినుంచి ఏదో ఒక విధంగా తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది. అలా వెండి తెర పైన కూడా అవకాశాలు అందుకుంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గా ఉంటూ అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇవ్వడమే కాకుండా తన గురించి అప్డేట్ కూడా తెలియజేస్తుంది. మొదటిసారి వెండితెర పైన పలు సినిమాలలో సైడ్ యాక్టర్ గా కూడా నటించగా ఆ తర్వాత బిగ్ బాస్ -4 లో పాల్గొని తన అందంతో బాగా ఆకట్టుకుంది.

అలా హౌస్ లో ఉన్నంతకాలం గేముతో మాటలతో అందరిని ఆకట్టుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ తర్వాత అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి సక్సెస్ అవుతోంది ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా నిలిచి అందరి దృష్టిలో నిలిచింది.ఒక ప్రైవేటు స్పెషల్ సాంగ్ లో కూడా చేయగా తన డాన్స్ స్టెప్పులతో అందరిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు అవకాశాలు అందుకోవడం చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు. గాడ్ ఫాదర్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించగా అంతగా మెప్పించలేకపోయింది. అసలు విషయంలోకి వెళ్తే ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక స్టోరీని పంచుకుంది. అందులో తను ఏదో జర్నీ చేస్తున్నట్లుగా కనిపించగా తన కళ్ళజోడు కిందికి దింపుతూ భూమరాంగ్ వీడియో చేస్తూ కనిపించింది.. దీంతో అది చూసిన నెటిజెన్స్ నువ్వు ఏడిస్తే మేము.. నిన్ను ఊరుకోబెట్టాల అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది బాయ్ ఫ్రెండ్ వదిలి వెళ్ళిపోయాడు ఏమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.