జబర్దస్త్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటుడు తాజాగా ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా ఎంపిక అవ్వడం జరిగింది. పంచ్ లతో పిల్లలను పెద్దలను కితకితలు పెట్టించిన ఈ నటుడు ఇప్పుడు పాఠాలతో పిల్లలకు చక్కని భవిష్యత్తును ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు. ఇదివరకే డైరెక్టర్ సుకుమార్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇలా ఎంతోమంది ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఆ తర్వాత సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఒక నటుడు మాత్రం అందుకు భిన్నంగా సినిమాలు,  కామెడీ స్కిట్లు చేసి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా ఉద్యోగం సంపాదించారు.. జబర్దస్త్ లో ఆయనకు అవకాశాలు వస్తున్నా సరే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న ఒక ఆలోచనతో టీచర్గా జాయిన్ అయ్యారు. ఒకటి రెండేళ్లు కాదు ఏకంగా 25 సంవత్సరాల కల అట.. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేయాలని 25 సంవత్సరాలుగా ఎదురుచూసిన ఆయన కల నెరవేరింది. ఇక ఆయన ఎవరో కాదు జబర్దస్త్ ద్వారా బాగా సుపరిచితుడు అయిన కమెడియన్ గణపతి.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట వారి వీధికి చెందిన గణపతి కామెడీతో కితకితలు పెట్టించారు. ఇక ఇప్పుడు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన గణపతికి ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా సేవలందించాలనేది లక్ష్యం. ఇటీవల అనంతపురం , కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, గోదావరి ,ప్రకాశం,  గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించగా 1998లో డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులను ఇప్పుడు జిల్లాల్లో టీచర్గా నియమించింది.

గత నెల 15వ తేదీన ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో డీఎస్సీ పరీక్షల్లో అర్హత కలిగిన అభ్యర్థులను కాంట్రాక్టు మీద నియమించింది. ఈ అభ్యర్థులలో నటుడు గణపతి కూడా ఉన్నాడు. ఇక ఇప్పుడు కొత్త వలస గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు గణపతి.

మరింత సమాచారం తెలుసుకోండి: