తాజాగా ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ మరణించడంతో అటు ఢీ, ఇటు జబర్దస్త్ పారితోషకాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ లో పారితోషకాలు ఎక్కువగా ఇస్తారని.. ఢీ షో లో తక్కువగా ఇస్తారంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇక గతంలో కూడా జబర్దస్త్ పై కమెడియన్స్ రకరకాల కామెంట్లు చేసేవారు..ముఖ్యంగా అక్కడ రాజకీయాలు ఎదుర్కోవాలి.. విలువ లేని చోట ఉండము అంటూ కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లు కూడా టీవీ చానల్స్ లోకి ఎక్కి మరి నానా రచ్చ చేశారు.

అయితే ఇప్పుడు జబర్దస్త్ లో కామెడీ చేసే వాళ్లకే ఎక్కువ పారితోషకం ఇవ్వడం అనేది ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఢీ డాన్స్ షోలో పాపులర్ డాన్స్ మాస్టర్గా చైతన్య మాస్టర్ కొనసాగారు.  కానీ ఆయన చేసిన అప్పులు తీర్చలేని కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.  అయితే ఢీ లో ఎక్కువ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసి మితిమీరిన అప్పులు ఆయన చేయడం వల్ల ఇలా జరిగిందని అనేవారు కూడా చాలామంది ఉన్నారు.  అయితే తాజాగా ఈ పారితోషకాల వ్యత్యాసాలపై ఒక వీడియో ద్వారా అసలు నిజాన్ని బయటపెట్టారు అదిరే అభి.

ఆయన మాట్లాడుతూ.. జబర్దస్త్ కి రేటింగ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇక్కడ పారితోషికాలు ఎక్కువగా ఉంటాయి.. ఇక్కడ పాపులారిటీని బట్టి పారితోషకం కూడా డిసైడ్ చేస్తారు అయినా కేవలం జబర్దస్త్ మాత్రమే చేసి బాగుపడలేదు.. జబర్దస్త్ చేసుకుంటూనే ఇతర షో ల ద్వారా సంపాదించుకొని డబ్బులు దాచుకుంటున్నారు వచ్చినంతలో కొంత మొత్తాన్ని దాచుకోవాలి.. ఎంత వస్తే దానిని అంత ఖర్చు పెడితే ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. ఇండస్ట్రీలోకి వచ్చి రాగానే ఎవరు పిలిచి ఆఫర్లు ఇవ్వరు ఎన్నో బాధలు పడి ఎన్నో రోజులు పస్తులు ఉంటే తప్ప ఈ పొజిషన్ రాదు అంటూ ఆయన తెలిపారు. ఇక చైతన్య మాస్టర్ కూడా పొదుపు చేసుకొని ఉంటే ఈ రోజు చనిపోయే పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: