
అయితే స్టార్ మా ఒప్పుకుంటే తాను తప్పకుండా బిగ్ బాస్ లోకి వెళ్తానని కూడా చెబుతున్నాడు ఇదిలా ఉండగా జానకి కలగనలేదు సీరియల్ లో ఒక పల్లెటూరి కుర్రాడి పాత్రలో అమర్దీప్ చెప్పే డైలాగులు మర్యాద అమాయకత్వం అటు అభిమానులనే కాదు ఇటు సీరియల్ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి ఈ సీరియల్ లో రామా పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. ఇక జానకి గారు అనే తన భార్యను పిలుస్తూనే ఆమె కల నెరవేర్చడానికి రామా పడే కష్టాలు నిజంగా అందరిని ఆలోచింపచేస్తాయి.
ఇదిలా ఉండగా ఈ సీరియల్ సహా తన రెమ్యూనరేషన్ పై తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు అమర్దీప్. ఒకప్పుడు తాను ఎన్నో కష్టాలు పడి అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఏది దొరికితే అది తినేవాడిని అని అమర్ దీప్ వెల్లడించారు. ఇకపోతే కష్టపడితేనే ఏదైనా వస్తుందని.. అదే అప్పుడు ఇప్పుడు తనను నిలబెట్టింది అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే తనకు బీటెక్ అవగానే జాబ్ వచ్చిందని, అయితే జాబ్ మానేసి అవకాశాల కోసం వెతికాను. అయితే ఎప్పుడు కూడా విసిగి వచ్చి వెనక్కి వెళ్ళిపోలేదు. ఇందులో ఎలాగైనా సరే సక్సెస్ కావాలని అనుకున్నాను అంటూ తెలిపారు. ఇకపోతే రెమ్యునరేషన్ గురించి చెబుతూ తాను ఎప్పుడూ పేరు , ఫేమ్ గురించి ఆలోచిస్తానని, జీతం గురించి పెద్దగా పట్టించుకోనని.. నచ్చిన పని చేసుకుంటూ వెళ్తే డబ్బు ఆటోమేటిగ్గా వస్తుందని తాను చెప్పుకొచ్చారు ఇకపోతే ఒక్కొక్క సీరియల్ కి నెలకు రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు తీసుకుంటున్నానని తెలిపారు.