బుల్లితెర యాంకర్ గా పేరు సంపాదించింది యాంకర్ వర్షిణి.. తన అందంతో యాంకరింగ్ స్టైల్స్ తో తనదైన స్టైల్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ముఖ్యంగా పటాస్-2, కామెడీ స్టార్స్, జబర్దస్త్ వంటి షోలలో కూడా యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో లతో కాస్త పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండేది సోషల్ మీడియాలో కూడా నిరంతరం యాక్టివ్గానే ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.


దాదాపుగా పదేళ్లుగా పలు సినిమాలలో సపోర్టింగ్ రోజులలో నటిస్తూనే ఉంది తప్ప హీరోయిన్గా సరైన అవకాశాలను అందుకోలేకపోతోంది.. గత కొంతకాలంగా వర్షిణి బుల్లితెర పైన కూడా ఎక్కడ కనిపించలేదు. సినిమాలపై ఆశలు పెట్టుకున్న పెద్దగా సక్సెస్ కాలేకపోవుతోంది. తాజాగా వర్షిణి పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. అదేమిటంటే తన మనసులో మాటను విని అందరూ ఒక్కసారిగా షాకీ గురవుతున్నారు. తన తల్లితో పాటు ఇంట్లో ఉన్న ఫోటోను పంచుకుంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ని జోడించింది.వర్షిణి ఇలా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో రాష్ట్రకొస్తూ.. తన వయసు ఇప్పుడు విచిత్రంగా మారింది.. తన వయసులో  ఉన్న కొంతమంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు మరి కొంతమంది ప్రెగ్నెన్సీ కూడా వస్తోంది అయినప్పటికీ తాను ఇంకా ఇంట్లోనే ఉన్నానని కనీసం బయటికి వెళ్లాలన్న ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ తెలియజేసింది. దీంతో ఇంతకీ ఈమె సమస్య ఏమిటో అంటూ పలువురు ఆ అభిమానులు నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ పోస్ట్ మాత్రం వైరల్ గా మారుతోంది. ఈ పోస్టు బట్టి వర్షిణి త్వరలోనే పెళ్లి చేసుకుని అవకాశం ఉందని చెప్పవచ్చు.. వర్షిణి హైపర్ ఆది గతంలో ప్రేమించుకుంటున్నట్లుగా పలు రకాల రూమర్లయితే వినిపించాయి.  కానీ ఈ విషయం పైన ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: