కమెడియన్ గా పేరు సంపాదించిన ధన్ రాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని పేరు.. సినీ ఇండస్ట్రీలో 25 ఏళ్ల పాటు కమెడియన్గా పలు చిత్రాలలో నటించి వెండితెర పైన అలరించారు. ఇప్పటివరకు సుమారుగా 60కు పైగా చిత్రాలలో నటించారు ధన్ రాజ్. ధన్ రాజ్ కు జబర్దస్త్ ద్వారా కూడా బాగానే పేరు సంపాదించుకున్నారు. అలా సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో ఒక్కసారిగా తన పేరు పాపులారిటీ అయ్యేలా చేసింది.. 2013లో జబర్దస్త్ షో ప్రారంభం కాగా మొదటిసారిగా అందులో టీమ్ లీడర్ గా ఎంపికైన ధనరాజ్.. 2017 వరకు కొనసాగారు.



ఆ తర్వాత జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చి పలు చిత్రాలలో నటించారు. అంతేకాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. జబర్దస్త్ షో నుంచి బయటికి వెళ్లడానికి కారణం పై తాజాగా స్పందించారు. ఇటీవలే ఇంటర్వ్యూలో పాల్గొన్న ధన్ రాజ్.. ఆలి టాక్ షో లో పాల్గొన్నారు. ఆ షోలో మాట్లాడుతూ వేణు, తనని యాంకర్లుగా చేయమని ఒక షో నిర్వాహకులు అడిగారు. ఎంతకాలమని ఆర్టిస్టులుగా చేస్తామని ఆలోచించి ఈ విషయం పైన మల్లెమాలకు కూడా  విషయం చెబుతామనుకున్నాము అందుకు వేణు కూడా సరే అన్నారు..


ఈ విషయాన్ని శ్యామ్ ప్రసాద్ గారి అమ్మాయి( మా మేడమ్ ) గారికి చెప్పాము.. జబర్దస్త్ షోకి ఇతర షోకి ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పాము. కానీ మేడమ్ ఒక మంచి విషయమే తెలిపారు.. టీవీ రంగంలో ఎక్కడైనా సరే  ఎక్క్లూసివ్ ఉంటుంది మీరు ఇక్కడ కనిపించి అక్కడ కనిపించడం అనేది బాగుండదని తెలిపిందట.. కావాలంటే మీరు అక్కడ షో చేసిన తర్వాతే ఇక్కడికి రండి అంటూ వారే పంపించారని కానీ అలా వెళ్లి కేవలం 24 షోలకి అక్కడ ఎపిసోడ్ ముగిసిపోయింది.ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేసి జబర్దస్త్ లోకి వచ్చాము కానీ అప్పటికి మేము చేసిన తప్పు మాకు అర్థమయ్యిందని..మల్లెమాల సంస్థ టీమ్ లీడర్ల విషయంలో చాలా ఇబ్బంది పడింది.ఆ సమయంలోనే ఇక సుధీర్, రాంప్రసాద్, రాకింగ్ రాకేష్ తదితరులు టీమ్ లీడర్ గా వచ్చారని.. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత అవకాశాలు అడగలేకపోయామని తెలిపారు. ఇప్పుడు మళ్లీ తిరిగి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు ధనరాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: