సరికొత్త స్మార్ట్ మొబైల్ .. భవిష్యత్తులో ప్రపంచ దేశాలలో మొబైల్స్ లేకపోతే అనే విషయం కూడా ఊహించుకోలేము.. అలా ఈ క్రమంలోనే నథింగ్ మొబైల్ ను విడుదల చేశారు. బ్యాంకు వర్క్, బిల్లుల చెల్లింపు ఇతర వ్యక్తిగతమైన విషయాలను స్మార్ట్ మొబైల్స్ లోనే ఇప్పుడు ఉండాల్సిందే.. దాదాపు ఇప్పుడు విడుదలైన మొబైల్స్ అన్ని ఒకేలాగా ఉంటున్నాయి. దీంతో కొత్తదనం కోరుకొనే వినియోగదారులకు ప్రస్తుతం ఉన్న మొబైల్స్ బోర్ కొట్టేసి అని చెప్పవచ్చు. ఇప్పుడు వినియోగదారులను ఆకట్టుకోవడానికి అంటే సరి కొత్తగా ఏదైనా ఒక మొబైల్ వస్తే తప్ప ఫోన్ అమ్మకాలలో అభివృద్ధి సాధించలేదని చెప్పవచ్చు.

ఇప్పటికే వైర్లెస్ ఇయర్ ఫోన్స్ తో మార్కెట్లోకి ప్రవేశించిన నథింగ్.. బ్రాండెడ్ నుంచి మరికొన్ని రోజులలో స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేయనుంది. మిగతా స్మార్ట్ మొబైల్స్ తో పోల్చుకుంటే ఈ నథింగ్ మొబైల్స్ లో ఎన్నో ఆకట్టుకొనే ఫీచర్స్ ఉన్నాయి. మిగతా స్మార్ట్ మొబైల్స్ తో పోల్చుకుంటే.. నథింగ్ మొబైల్స్ లో ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానెల్ గురించి చెప్పుకోవలసిందే. ఈ నథింగ్ స్మార్ట్ఫోన్ పారదర్శకమైన ప్యానల్ ను కలిగి ఉంటుంది అంటే మొబైల్ లోపల ఉండే హార్డ్వేర్ భాగాలను మనం డైరెక్ట్ గా చూసుకోవచ్చు.

నాణ్యమైన గ్లాస్ మెటీరియల్ తో తయారు చేయబడిన ఈ మొబైల్ వినియోగదారులకి మంచి అనుభూతిని కలిగించేలా కనిపిస్తోంది. ఇప్పటికే నథింగ్ సంస్థ నుంచి వచ్చిన ట్రాన్స్పరెంట్ ఇయర్ ఫోన్స్ భారత్ మార్కెట్లో బాగా సక్సెస్ అయింది. ఫ్లిప్ కార్ట్ లో లభిస్తున్న ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ విలువ.. రూ.7,000 రూపాయలు ఉన్నది. ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్న ఈ నథింగ్ మొబైల్ ఈ ఏడాది జూలై రెండోవారంలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ స్మార్ట్ మొబైల్ లో వైర్లెస్ ఛార్జింగ్ సౌకర్యం కూడా కలదు. అంటే మొబైల్ ఛార్జింగ్ పాడ్ పై కూడా వినియోగదారులు ఒక సరికొత్త అనుభూతిని పొందవచ్చు. ఇది ఆండ్రాయిడ్ మొబైల్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ద్వారా  రూ 41 వేలు ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: