
మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారా అనే ఆఫ్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్.. ఇకపోతే వాట్సాప్ కొత్త ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు ఈ ఫీచర్‌ను వినియోగించొచ్చు. మీ ఆన్‌లైన్ స్టేటస్‌ను అవతలి వ్యక్తులకు కనిపించకుండా హైడ్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
కుడి వైపున పైన మూలలో మూడు చుక్కల గుర్తుపై క్లిక్ చేయాలి.
అందులో సెట్టింగ్ ఆప్షన్స్‌పై క్లిక్ చేయాలి.
ఆ తరువాత అకౌంట్స్‌కి వెళ్లి.. ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు లాస్ట్ సీన్ అండ్ ఆన్‌లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
ఇప్పుడు 'ఆన్‌లైన్' అని ఉన్న చోట Every One, Same as Last Seen అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి.
మీ ఆన్‌లైన్ స్టేటస్‌ను ఎవరూ చూడొద్దు అనుకుంటే Same as Last Seen అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి..ఈ ఆఫ్షన్ ద్వారా మీ స్టేటస్ ను హైడ్ చేయొచ్చు..