ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యింది. అందువల్ల మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. మోసగాళ్లు ఇప్పుడు గూగుల్ పే, ఫోన్‌పే వాడే వారే టార్గెట్‌గా పెట్టుకోని మోసం చేస్తున్నారు. అందువల్ల మీరు మీరు గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటే మాత్రం కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే విషయం తెలుసుకోవాల్సిందే. ఇక మోసగాళ్లు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఇతరులకు డబ్బులని పంపిస్తారు. ఆ తర్వాత కాల్ చేసి డబ్బులు పొరపాటుగా మీ అకౌంట్‌కు వచ్చాయని సాకులు చెబుతారు. అటుపైన ఆ డబ్బులు తిరిగి పంపాలని మిమ్మల్ని కోరతారు. ఏముందిలే అని చాలా మంది తిరిగి పంపుతారు. అక్కడే మీరు ఖచ్చితంగా మోసపోతారు.మీరు కనుక ఆ డబ్బులు తిరిగి వారికి పంపిస్తే.. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ దెబ్బకి ఖాళీ అయిపోతుంది.అయితే మోసగాళ్లు వందలు లేదా వేలలో డబ్బులు పంపరు.


కేవలం రూ.10 లేదా రూ. 50 ఇలా మాత్రమే పంపిస్తారు.వాళ్ళు పంపింది చిన్న అమౌంట్ కదా అని మీరు తిరిగి వెనక్కి పంపించే ఛాన్స్ ఉంటుంది.ఇక ఇలా మీరు డబ్బులు కనుక వెనక్కి పంపితే.. అప్పుడు మీరు ఖచ్చితంగా మాల్వేర్ ఎటాక్ బారిన పడాల్సి వస్తుంది. ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ నిపుణులు పవర్ దుగ్గల్ ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. మాల్వేర్ అండ్ హ్యుమన్ ఇంజినీరింగ్ స్కామ్‌గా దీన్ని పిలుస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ విధానంలో మోసగాళ్లు మీ అకౌంట్‌కు డబ్బులు పంపిస్తారని తరువాత పొరపాటుగా వచ్చాయని కాల్ చేస్తారని, ఆ తరువాత మిమ్మల్ని డబ్బులు తిరిగి వెనక్కి పంపాలని కోరతారని వివరించారు. అప్పుడు మీరు కనుక డబ్బులు వెనక్కి పంపిస్తే.. మీ అకౌంట్ హ్యాక్ చేస్తారని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా మోసపోయి డబ్బులు పోగొట్టుకోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

UPI