ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ మొబైల్ లేనిదే కాలం గడిచేలా కనిపించలేదు.. ముఖ్యంగా ఇంటర్నెట్ ను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటూ ఉన్నారు. ఇలాంటి ఇంటర్నెట్ ఒక్కసారిగా వేగం తగ్గిపోతే ఎన్నో పనులు కూడా ఆగిపోతాయి.. మొబైల్ లో ఇంటర్నెట్ లేకపోతే మొబైల్ యూస్ చేయడానికి కూడా పెద్దగా ఇష్టపడరు యూజర్స్. అయితే కొన్నిసార్లు నెట్వర్క్ సమస్యల వల్ల ఇంటర్నెట్ స్లోగా వస్తూ ఉంటుంది. అలాంటి సమయాలలో వేగాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


వైఫై నెట్వర్క్ కూడా స్లోగా వస్తున్నట్లు అయితే కనెక్షన్స్ యూజర్స్ ని తగ్గించుకోవడం చాలా మంచిది. కొంతమంది మొబైల్ బ్రౌజర్ లో క్యాచ్ హోల్డర్లు క్యాచే అనే డేటా కూడా స్టోరేజ్ అవుతూ ఉంటుందట.. అయితే ఇది మనం ఏదైనా వెబ్సైట్ని ఎక్కువగా యూస్ చేస్తే సమయాలలో త్వరగా ఓపెన్ అయ్యేలా చేస్తుంది. దీని వల్ల కూడా ఇంటర్నెట్ స్పీడ్ పెరిగిన మొబైల్ మాత్రం పనితీరు నెమ్మదిగా పనిచేస్తుందట. అందుకు కారణం క్యాచే మెమొరీ నిండినప్పుడు మొబైల్ వేగవంతాన్ని తగ్గిస్తూ వస్తుంటుందట.


అందుచేతనే మనం వారానికి ఒకసారైనా మొబైల్ ని స్కాన్ చేస్తూ ఉండాలి ఈ స్కాన్ లో అనవసరపు ఫైల్స్ క్యాచే వివరాలు కూడా డిలీట్ చేయబడతాయి. దీనివల్ల మొబైల్ స్పీడ్ కూడా వేగవంతం పెరిగి నెట్వర్క్ స్పీడ్ కూడా పెరుగుతుందట. ప్లే స్టోర్ లో క్లీనర్ యాప్స్ చాలానే ఉన్నాయి.. కొన్నిసార్లు మన మొబైల్ నెట్వర్క్ స్లో కావడానికి కారణం నెట్వర్క్ సెట్టింగ్ కూడా ఒక కారణమట . అలాంటి సమయంలో నెట్వర్క్ సెట్టింగ్ చేయాలి ఆ తర్వాత మొబైల్ ని రీసెట్ చేయడం మంచిది. బ్యాక్ గ్రౌండ్ యాప్స్ కూడా తెరవడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా వస్తుంది. ఆటోమేటిక్ అప్డేట్ ఉంచడం వల్ల డేటా ఎక్కువగా వినియోగిస్తుంది. ఇది ఆఫ్ చేసుకోవడం మంచిది. నెలలో ఒకసారైనా మొబైల్ ని ఆఫ్ చేసి ఆన్ చేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: