
మెసేజ్ ఐడీలుగా పిలవబడే ఈ ఫీచర్ SMS ఇన్బాక్స్లను సైతం స్కాన్ చేసి అవి ఎక్కడి నుంచి వచ్చాయో ధ్రువీకరించబడి వ్యాపారాల నుంచి ఓటీపీలు, టికెట్ బుకింగ్ స్టేటస్, డెలివరీ అప్డేట్స్ తో సహా మరికొన్ని సేవలకి పరిమితం అవ్వకుండా అన్ని సందేశాలను గుర్తించే విధంగా AI ని ఉపయోగిస్తుందట. ట్రూ కాలర్ ప్రకారం ఈ సందేశాలు ఇన్బాక్స్లో ఆకుపచ్చ చెక్ మార్కుతో మనం గమనించవచ్చట. ఈ ట్రూ కాలర్ ఇండియా తో పాటుగా 30 దేశాలలో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమైన బిజినెస్ సందేశాలను సైతం గుర్తించడానికి ఎస్ఎంఎస్ ఇన్బాక్స్ స్కాన్ చేయడానికి ఈ ఫీచర్ ని AI,LLM ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ టెక్నాలజీ ప్రాసెసింగ్ చేయడం వల్ల వినియోగదారుడు యొక్క డేటా కూడా చాలా సురక్షితంగా ఉంటుంది అంటూ ట్రూ కాలర్ తెలియజేస్తోంది. అయితే ఈ ఫీచర్ ని సబ్స్క్రైబ్ లకే పరిమితం కాకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండేలా చూస్తోందట. ఇంగ్లీష్ ,హిందీ, స్పానిష్ తో సహా అన్ని ప్రపంచ భాషలతో మద్దతుతో వీటిని ప్రవేశపెడుతున్నట్లు తెలియజేస్తోంది ట్రూ కాలర్. అయితే ఇతర ముఖ్యమైన సందేశాలను సైతం గుర్తించి మరి హైలైట్ గా చేస్తుండట. AI ప్రభావితం చేసే అంశాలకు కీలకంగా ఉంటాయని దీనివల్ల వినియోగదారుడు కూడా వెంటనే స్పందించడానికి వీలు కలిగేలా ఉంటుందట.