ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అరక్షణంలో అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. మొబైల్ ఫోన్ అందుబాటులో లేకముందు పేపర్లలో లేదా టీవీలలో చూసి మాత్రమే విషయాలు తెలుసుకునేవారు. ఇతర దేశాల్లో ఏదైనా సంఘటన జరిగితే మన ఇండియన్ వాళ్లకు తెలియడానికి కనీసం వారాలకు పైన పట్టేది. గ్రామీణ ప్రాంతాలకు ఆ న్యూస్ చేరాలంటే నెలల తరబడి వేచి చూసేవారు. కానీ ఆ పరిస్థితి  ప్రస్తుతం లేదు . ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మన ముందు కనబడుతోంది. అయితే మెయిన్ మీడియా ద్వారా ఈ విషయాలు గతంలో తెలిసేవి. కానీ ఇప్పుడు మెయిన్ మీడియా కంటే సోషల్ మీడియా చాలా ఫాస్ట్ అయిపోయింది. 

అన్ని విషయాలు సోషల్ మీడియాలోనే ముందుగా తెలుస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా వార్త ప్రసారమైన తర్వాతే మెయిన్ మీడియా లోకి వెళ్తుంది. అలాంటి పరిస్థితులు  ప్రపంచంలో నెలకొన్నాయి. తాజాగా  ఏపీలోని ఒక వ్యక్తికి సంబంధించి సోషల్ మీడియాలో నాలుగు రోజుల నుంచి మార్మోగిన తర్వాత  పేపర్లలో వచ్చింది. దీన్ని బట్టి చూస్తే సోషల్ మీడియాను జనాలు ఏ విధంగా ఫాలో అవుతున్నారు ఎంత ఫాస్ట్ గా సమాచారం అందుకుంటున్నారో  తెలుసుకోవచ్చు. ఈ మధ్య ఏపీకి చెందినటువంటి ఒక యువకుడు తన టాలెంట్ తో ఒక జీపును తయారు చేశాడు. అందులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి..

ప్రయాణికుల్ని బట్టి సీట్ల సంఖ్యను మార్చుకునే వెసులుబాటు కూడా ఆ జీప్ కి ఉంది.. కాకినాడకు చెందిన రాయవరపు సుధీర్ తన సొంత ఐడియాతో ఈ వాహనాన్ని తయారు చేశాడు. ఈ జీపు చూడటానికి కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ట్రాఫిక్ కష్టాల నుండి పుట్టిన ఈ ఆలోచనే సుధీర్ లోని టాలెంట్ పది మందికి తెలిసేలా చేసింది.  హైడ్రాలిక్స్ తో ఆరు నెలల పాటు కష్టపడి ఈ జీపును తయారు చేశాడు. బ్యాటరీతో నడిచే ఈ జీప్ తయారీకి 2.50 లక్షల రూపాయలు ఖర్చయిందని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా ఇందులో ఇద్దరు కూర్చుంటే రెండు సీట్లు నలుగురు కూర్చుంటే నాలుగు సీట్లు పెంచుకునేలా రూపొందించారు.

ఇద్దరు ప్రయాణికులు ఉన్నప్పుడు ఒకరు కూర్చొని  మరో రెండు సీట్లను దగ్గరికి మడవవచ్చు. ట్రాఫిక్ లో ఇబ్బందులు ఉంటే ఈ జీపును ఈజీగా మనం ముందుకు తీసుకెళ్లవచ్చు. ఎవరైనా సహకార అందించే వారు ఉంటే ఈ జీపును 1.80 లక్షలకు మాత్రమే తయారు చేయాలని తన టార్గెట్ అని సుదీర్ తెలియజేశారు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో గత నాలుగు రోజుల నుంచి మార్మోగిపోయింది. కానీ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాక నాలుగు రోజులకు పేపర్లలో వచ్చింది. దీన్ని బట్టి చూస్తే సోషల్ మీడియా ద్వారా సమాచారం ఎంత ఫాస్ట్ గా అందుతుందో  అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: