టెలికాం నెట్వర్క్ సంస్థలలో జియో, ఎయిర్టెల్ కు పోటీగా ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ పోటీపడి మరి తమ సర్వీసులను అందించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రైవేటు టెలికాం సంస్థలు భారీగా రీఛార్జ్ ప్లాన్లు పెంచేయడంతో సామాన్యులు సైతం తట్టుకోవడం కష్టంగా మారింది. దీంతో చాలామంది బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి మారుతున్నట్లు పలువురు టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా బిఎస్ఎన్ఎల్ ట్రిపుల్ ప్లే సర్వీసెస్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అతి తక్కువ ధరకే యూజర్స్ కి ఈ సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చేలా చేస్తోంది బిఎస్ఎన్ఎల్.


ట్రిపుల్ ప్లే సర్వీస్ అంటే బ్రాడ్ బ్యాండ్ , ల్యాండ్ లైన్ మరియు టీవీ కోసం ప్రత్యేకించి ఒక ప్యాకేజీ అన్నట్లుగా తెలుస్తోంది. అయితే కర్నూల్ లో బిఎస్ఎన్ఎల్ కేవలం రూ.400 రూపాయలకే ఈ ప్లాన్ ని ప్రారంభించబోతున్నట్లు బిఎస్ఎన్ఎల్ టెలికాం ప్రిన్సిపల్ జిఎం రమేష్ తెలియజేశారు. రూ.400  రూపాయలకి హైస్పీడ్ ఇంటర్నెట్ రావడమే కాకుండా 400 టీవీ చానల్స్, 9 ఓటీటి ఛానల్స్ తో పాటు అపరిమితమైన వాయిస్ కాలింగ్ కూడా కల్పించబోతున్నట్లు జిఎం రమేష్ తెలియజేశారు.


అలాగే కేవలం ఒక్క రూపాయికే ఫ్రీడమ్ ప్లాన్ సిమ్ కార్డును కూడా అందిస్తామని తెలియజేస్తున్నారు. 30 రోజులపాటు ప్రతిరోజు 2GB డేటాతో పాటుగా అపరిమిత కాల్స్ తో పాటు 100 SMS లను ఉచితంగా పొందవచ్చు అంటు తెలుపుతున్నారు. ఆత్మ నిర్భర్ లో భాగంగా బిఎస్ఎన్ఎల్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతో ఈ 4G సేవలను సైతం ప్రారంభించబోతున్నట్లు జి.ఎం రమేష్ తెలియజేశారు. అలాగే రాబోయే రోజుల్లో బిఎస్ఎన్ఎల్ ని మరింతగా ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు పలు రకాల ప్లాన్లతో పాటు, చౌకైన ధరలకే తీసుకువచ్చేలా చేయబోతున్నామంటూ తెలియజేస్తున్నారు అధికారులు. మరి దీనివల్ల బిఎస్ఎన్ఎల్ యూజర్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నది. దీనివల్ల ప్రభుత్వానికి మరింత వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: