రవిశంకర్ భారతీయ ఆధ్యాత్మిక గురువు. ఇతన్ని తరచుగా శ్రీ శ్రీ అని, గురూజీ అని , గురుదేవ్ అని అందరూ పిలుస్తూ ఉంటారు.. శ్రీ శ్రీ రవిశంకర్
 మే 13 1956వ సంవత్సరంలో తమిళనాడులోని పాపనాశం లో విశాలాక్షి రత్నం, ఆర్ ఎస్  వెంకటరత్నం దంపతులకు జన్మించారు. ఈయన భానుమతి నరసింహన్ కు  సోదరుడు. పుట్టింది ఆదివారం కావడంతో రవి అని, 8వ శతాబ్దపు హిందూ గురువైన ఆదిశంకరుడి పేరుమీదుగా శంకర్ అని పెట్టారు. సాధారణంగా రవిశంకర్ పుట్టినది ఆదిశంకరుడు పుట్టిన రోజునే. ఆయన మొదటి గురువు వేదపండితుడు మహాత్మా గాంధీ యొక్క సన్నిహితుడైన సుధాకర్ చతుర్వేది..



శ్రీ శ్రీ రవిశంకర్ బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ పట్టాను పొందాడు. తర్వాత శంకర్ తన రెండవ గురువు మహర్షి మహేష్ తో కలసి  ప్రయాణించాడు. అలా ప్రసంగాలు చేయడం, వేదశాస్త్రాల పై సమావేశాలు ఏర్పాటు చేయడం, భావాతీత ధ్యానం, ఆయుర్వేద కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటివి చేయడం మొదలుపెట్టారు. ఇక 1980వ సంవత్సరంలో శంకర్ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక పై ఆచరణాత్మక ,అనుభవపూర్వక కోర్సులను ప్రారంభించాడు. 1982 లో కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా లోని భద్రా నది ఒడ్డున పది రోజులు ధ్యానం చేసి, ఆ తర్వాత తన సుదర్శన క్రియ అనే లయబద్ధమైన సాధనలు నేర్చుకున్నాడు.

ఇక 1983 వ సంవత్సరంలో స్విట్జర్లాండ్లో శంకర్ తన మొట్టమొదటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సు ను నిర్వహించాడు. 1986 లో ఉత్తర అమెరికాలో మొట్టమొదటి కోర్సు కోసం, అమెరికాలోని కాలిఫోర్నియా లోని ఆపిల్ ర్యాలీకి వెళ్ళాడు. ఇక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపించి, అది ప్రజలకు సామాజిక సహాయాన్ని అందించే స్వచ్ఛంద సంస్థగా తీర్చిదిద్దారు. 1997లో అతను జెనీవాలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ఎల్లప్పుడూ సహాయక చర్యలు, గ్రామీణ అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటుంది. అయితే ఈయన స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ శాఖలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. ప్రధాన శాఖ బెంగళూరు సమీపం వద్ద ఉంది.. ఇక శ్రీశ్రీ రవిశంకర్ కనుగొన్న సుదర్శన క్రియ అత్యంత  ప్రసిద్ధి అని చెప్పవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: