సముద్రం లో చేపలు పట్టడానికి వెళ్లిన జాలరి కి సముద్రం లో జాక్ పాట్ తగిలింది. ఆ వస్తువు సుమారు 30 కిలోల బరువుతో మెరుస్తూ కనిపించడం తో ఆ వస్తువును నిపుణుల సలహా కోసం తీసుకు వెళ్ళాడు. ఆ నిపుణులు చెప్పిన విషయాలను తెలుసుకొని అతడు ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యాడు. అది ఒక తిమింగలం వాంతి. వివరాలలోకి వెళితే నారోంగ్ ఫేచరాజ్ అనే జాలరి చేపల వేట చేస్తూ రోజుకు 20 వేలకు పైగా సంపాదిస్తాడు. రోజులాగే అతడు చేపలవేటకు వెళ్లి తిరిగి వస్తుండగా సూరత్ థాని లోని నియోమ్ బీచ్ సమీపంలో నారోంగ్ ఫేచరాజ్ కు ఒక వింత వస్తువు కనిపించింది. 


ఆ వస్తువు ఏమిటా అని చూసేందుకు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు . ఆ వస్తువు దగ్గరకు వెళ్లే కొలది మెరుస్తూ ఆకర్శించింది. అప్పుడు అతడికి అర్థమైంది అది ఒక తిమింగలం వాంతి అని. 30 కిలోల బరువున్న ఆ ముద్దను తీసుకొని సోంగ్లా యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ కి చూపించాడు .అతడు ఆ వస్తువును పరీక్షించి అది ఒక మగ తిమిగలం యొక్క వాంతి అని చెప్పి దానిని జీర్ణించుకోలేక వాంతి చేసి ఉండవచ్చని తెలియజేసాడు. అయితే మగ తిమింగలం లో స్రవించే వ్యాక్స్ పదార్థం తో అజీర్తి కలసి వాంతి చేసుకొని ఉండవచ్చని తెలియజేసాడు. ఆ వాంతి బయటి వాతావరణానికి గట్టిపడి అమ్బెర్గ్ రిస్ గా మారి ఉండవచ్చని చెప్పాడు .



అమ్బెర్గ్ రిస్ లు సముద్ర నిధి గా పిలుస్తారు . అమ్బెర్గ్ రిస్ లు మార్కెట్ లో ఒక కిలో ధర 1 కోటి రూపాయలు. వీటిని పర్ ఫ్యూమ్ తయారీలో వాడుతుంటారు. ప్రస్తుతం ఆ తిమింగలం 30 కిలోల వాంతి 10 కోట్లకు అమ్ముడు పోయింది . ఈ సంఘటన తో నారోంగ్ ఫేచరాజ్ కోటీశ్వరుడు అయ్యాడు. గతం లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి ఎంతో మంది జాలర్లను తిమింగలం వాంతి వారిని కోటీశ్వరులను చేసింది. అయితే ప్రత్యే కంగా అమ్బెర్గ్ రిస్ ల కొరకు కొందరు ప్రత్యేకం గా వేట కొనసాగిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో

మరింత సమాచారం తెలుసుకోండి: