పెళ్ళి అనేది చాలా సాంప్రదాయమైన అంశం.. ఈ పెళ్ళి జీవితం లో ఒక సారి, ఒకరితో మాత్రమే జరుగుతుంది. అందుకే అంటారు.ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు మాత్రం పెళ్ళి తర్వాత పెళ్ళి చేసుకుంటూన్నారు.. మానవ జీవితం పెళ్ళి మర్చిపోలెని మధుర ఘట్టం. అందుకే చాలా సంబంరంగా జరుపుకుంటారు. అందుకే అందరూ తమ వివాహ వేడుకను గ్రాండ్‌గా జరుపుకోవాలనుకుంటారు.. బంధు మిత్రుల తో కలిసి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళ పెళ్ళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ధూమ్ ధామ్ గా జరుగుతుంది.


అయితే పెళ్ళి తంతు మొదలైంది అంటే సంగీత్ లో రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు సంగీత్‌ల కు పెళ్లిలో ప్రాధాన్యం బాగా పెరిగిపోయింది. ఇందులో భాగంగా వధూవరులతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు సరదాగా ఆడిపాడుతున్నారు. రక రకాల పాటలతో సినిమా హీరోల కన్నా ఎక్కువగా డ్యాన్స్ ను ఇరగదీస్తున్నారు. ఈ మధ్య కాలంలో పెళ్ళి లలో చేసే డ్యాన్స్ సోషల్ మీడియాలొ వైరల్ అవుతుంది.


ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన 'ఏ దిల్ హై ముష్కిల్‌' సినిమాలోని 'క్యూటీపీ' అనే పాట ఎంతో ఫేమస్‌ అయింది. పెళ్లి వేడుక నేపథ్యం లో సాగే ఈ పాటను ఇప్పటికే చాలామంది రీక్రియేట్‌ చేశారు. తాజాగా భరత్‌ ధింగ్రా అనే వరుడు కూడా ఈ పాటకు స్టెప్పులేశాడు. పెళ్ళికి వచ్చిన బంధువుల తో కలిసి చిందెసాడు. అతడి డ్యాన్స్ పక్కన పెడితే పెళ్ళి కూతురు మాత్రం ఒకింత షాక్ కు గురైంది. అతని ఎనెర్జి చూసి ఆశ్చర్యపోయింది. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు నవ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియో ను మీరు కూడా ఒకసారి చూడండి..



మరింత సమాచారం తెలుసుకోండి: