సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని వీడియోలు మాత్రం ఆకర్షిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అయితే పెళ్లి లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. పెళ్లిలో వధువు వరుడు అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ లు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. అంతేకాదు ఇక ఇలా డ్యాన్సులు చేయడమే ట్రెండ్ గా నడుస్తుంది నేటి రోజుల్లో. దీంతో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి డాన్స్ నేర్చుకుని మరీ వివాహ వేడుకలలో డాన్సులు చేస్తూ ఉన్న వీడియోలు ఎన్నో వైరల్ గా మారిపోతున్నాయి.


 ఇలా వివాహ వేడుకలలో డాన్సులు చేయడం కొంతమంది నూతన వధూవరులను సెలబ్రిటీలు కూడా మార్చేస్తుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఒక వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక పెళ్లికూతురు పెళ్లి మండపం పై ఒక అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి ఆకట్టుకుంది. చకా చెక్ అంటూ స్టెప్పులు వేసింది. సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటించిన ఆత్రంగి రే చిత్రంలో చక చక్ పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదే పాట పైన వధువు కూడా కాలు కదిపింది.  కేరళలోని త్రిస్సూర్ కు చెందిన ఓ వధువు తన పెళ్లి రోజున ఇలాంటి డాన్స్ చేసి ఆకట్టుకుంది.


 అందరూ వివాహ వేడుకల్లో డాన్స్ చేస్తున్నారు నేనేమైన తక్కువ అనుకున్నారో ఏమో.. నవ వధువు రంజిత ఆర్ నాయర్ తన వివాహ వేడుకలు డాన్స్ చేయాలని అనుకుంది. దీనికోసం బాగానే ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. తనతో పాటు మరికొంతమందిని కలుపుకొని స్టేజ్ పై మాత్రం ఆత్రంగి రే అనే సినిమాలోని చక చెక్ అనే పాట పై స్టెప్పులేసింది. దీంతో అక్కడున్న వారందరూ దీన్ని మొబైల్లో చిత్రీకరించారు. ఇక వధువు ఇలా డ్యాన్స్ చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న వరుడు చూస్తూ నవ్వుతూ కనిపించాడు. అయితే ఇక పాటకు తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆ వధువు చేసిన డ్యాన్స్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir