ప్రముఖ దిగ్గజ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు 26 సంవత్సరాలు కలిగిన జైన్ నాదెళ్ల సోమవారం మరణించారు. ప్రపంచంలోని దిగ్గజ టెక్ కంపెనీలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఇక సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల ఇక లేరు అని పేర్కొనడం అత్యంత విషాదకరం. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ కు ఈ మెయిల్ ద్వారా వెల్లడించడం జరిగింది. జైన్ నాదెళ్ల పుట్టుకతోనే సెరెబ్రెల్ పాల్సీ తో జన్మించారు.. సెరెబ్రెల్ పాల్సీ అంటే పుట్టుకతోనే బ్రెయిన్ డామేజ్ అవుతుంది ఫలితంగా బ్రెయిన్ కు కాళ్లు.. చేతులపై ఎటువంటి కంట్రోల్ ఉండదు .. అంటే వీళ్ళు ఇంకా నడవలేరు అలాగే ఏ పని కూడా చేయలేరు ఇక వీరు జీవించి ఉన్నంత కాలం వీల్ చైర్ కి పరిమితం కావాల్సి ఉంటుంది.


ఇక సత్య నాదెళ్లకు కుమారుడితో పాటు ఇద్దరు కూతుళ్లు కూడా జన్మించారు. ఇకపోతే సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి వైకల్యం కలిగిన రోగులకు మెరుగైన సేవలు అందించడానికి కావలసిన ఉత్పత్తుల రూపకల్పనపై ఆయన దృష్టి సారించారు. ఇక ఈ నేపథ్యంలోనే తన కొడుకు జైన్ నాదెళ్ల నుంచి తాను నేర్చుకున్న పాఠాలను ఇందుకు ఉదాహరణగా వివరించేవారు. జైన్ నాదెళ్ల ఎక్కువగా చిల్డ్రన్స్ హాస్పిటల్ అయిన సీటెల్ చిల్డ్రన్స్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ బ్రెయిన్ రీసెర్చ్ లో ఎక్కువగా చికిత్స తీసుకోవడం జరిగింది.

ఇక ఈ హాస్పిటల్ పీడియాట్రిక్ న్యూరో సైన్సెస్ లో జైన్ నాదెళ్ల  ఎండోర్ చైర్ స్థాపించడానికి నాదెళ్ల తో పాటు గత ఏడాది ఒప్పందం కూడా తీసుకుంది. పోతే జైన్ నాదెళ్ల సమస్య తీవ్రతరం కావడంతో సోమవారం మరణించడం జరిగింది. దీంతో సత్య నాదెళ్ల కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఏది ఏమైనా ఎలా ఉన్నా సరే 26 సంవత్సరాల వయసు కలిగిన తన పుత్రుడు మరణించాడు అంటే ఇక ఆ బాధ వర్ణనాతీతం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: