ఎక్కడైనా సరే ఒక ఇంట్లో అన్న చెల్లులు ఇలా ఉన్నప్పుడు ఆ చెల్లి ఏం చేస్తుంది... తన ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడ ఎక్కడ తిరుగుతుంది వారితో కలిసి ఏం చేస్తుంది అనే విషయాలకు సంబంధించి ఆ అన్నకు అనేక అనుమానాలు ఉంటాయి. ఇక అదే తరహాతో ఆమెను గురించి తెలుసుకుంటూ ఆమె చెడు మార్గంలో వెళ్లకుండా రక్షణగా ఉండి అన్ని తానై చూసుకుంటుంటాడు. మరి ఆ తరహాకి చెందిన ఒక స్టోరీనే ఇక్కడ జరిగింది మరి అదేంటి అసలు ఏం జరిగింది ? ఎక్కడ జరిగింది ? అనే విషయాలను మనం తెలుసుకుందాం.

తన చెల్లి ప్రియుడితో కలిసి బైకుపై తిరుగుతోందని తెలుసుకున్న ఆ అన్నకు ఇక ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ తరుణంలోనే ఎలాగైనా సరే వారిని పట్టుకొని తీరాలి అని అనుకున్నాడు. ఇక ఇంట్లో నుంచి తన చెల్లి బయటకు వెళ్తున్న ప్రతి సారి ఎక్కడికి వెళ్తుంది. తన ప్రియుడితో కలిసి ఏం చేస్తుందో అనే విషయాలను అయితే గమనించడం మొదలుపెట్టాడు. ఆ తరుణంలోనే తన  ప్రియుడితో కలిసి బైకుపై వెళ్తున్న చెల్లిని చూసిన ఆ అన్నకు ఇక ఆవేశం తన్నుకు వచ్చేసింది .. అంతే ఇక వారిని ఎలాగైనా సరే నడిరోడ్డుపైనే ఆపాలని చాలా ప్రయత్నం చేసాడు.  అయితే అది గమనించిన వాళ్ళు  బైక్ వేగం పెంచి అక్కడ నుండి తప్పించుకున్నారు.

ఐతే అది చూసిన అన్న ఎలాగైనా పట్టుకోవాలనుకుని సినీఫక్కీలో మాదిరిగా వారిని పట్టుకునేందుకు ఒక మినీ ట్రక్కుతో ఛేజ్ చేశాడు. అంతలో రోడ్డుపై వెళ్తున్న బైకును వెనుక నుండి చూసిన అన్న మినీ ట్రక్కుతో వేగంగా వచ్చి వారిని ఢీకొట్టాడు. దీనితో ప్రియుడుతో  సహా చెల్లి కూడా గాయాలు అయ్యాయి. మరి ఈ ఘటన ఎక్కడో కాదు మధ్యప్రదేశ్ లోని భోపాల్ అయోధ్యనగర్ ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు  ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలోతెగ వైరల్ అవుతోంది. తన చెల్లిని ఆలా  ప్రియుడితో కలిసి బైకుపై తిరగడాన్ని చూసిన ఆ అన్న కోపంతో చెలరేగిపోయాడు. ఇక  తన సోదరి మరొకరితో అలా తిరగడాన్ని చుసిన అన్న ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అందులో భాగంగానే వారు వెళ్తున్న బైకును  తన మినీ ట్రక్కుతో ఫాలో అయ్యి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు.

అంతే కాదు బైకుతో పాటు తన చెల్లిని , అలాగే  ఆమె ప్రియుడిని కూడా పది మీటర్ల దూరం వరకు తన  ట్రక్కుతో ఈడ్చుకెళ్లడం గమనార్హం.  ఇంత చేసినప్పటికీ కూడా అతడి ఆగ్రహం కొంచెం కూడా చల్లారలేదు.. దానితో ట్రక్కులో నుంచి కిందికి దిగి సోదరి, అలాగే ఆమె ప్రియుడిపై దాడి కూడా చేశాడు. ఆ తర్వాత ఆ ప్రాంతం నుండి పరారయ్యాడు. అయితే ఆ దాడిలో గాయపడిన ఇద్దరిని అక్కడ ఉన్న వారు సమీపంలోని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే దాడి తరవాత బాధితులు  పోలీసులకు ఫిర్యాదును అందించారు. మరి వారు ఇచ్చిన  ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద అన్నపై కేసు నమోదు చేసిన  పోలీసులు నిందితుడును అరెస్ట్ చేశారు. మరి ఈ దారుణానికి చెందిన ఘటన అక్కడ గల సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వగా ..ఇప్పుడు  ఆ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: