సాధారణంగా కోతులు చేసే చేష్టలు కొన్ని కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తా ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో అయితే అడవుల్లో ఉండే కోతులు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తు తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. సాధారణంగా ఎక్కడైనా కోతులు ఉన్నాయి అంటే చాలు ఇక అటువైపు చేతిలో ఏదైనా తిను బండారాలు పట్టుకునివెళ్ళటానికి భయపడి పోతూ ఉంటారు జనాలు. ఇక ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేతిలో ఉన్న వస్తువులను లాక్కేళ్ళటం, తినుబండారాలు తీసుకు వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటాయి.


 ఇటీవలే ఒక కలెక్టర్కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తినుబండారాలు  కాదు ఏకంగా కలెక్టర్ కళ్ళద్దాలు ఎత్తుకెళ్ళింది కోతి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని మధుర జిల్లాలో వెలుగుచూసింది. బృందావనంలో జిల్లా కలెక్టర్ కళ్ళజోడు ఒక కోతి ఎత్తుకెళ్లింది. కోతిని భయపెట్టి కళ్లద్దాలను తీసుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. చివరికి మనుషులకు ఇచ్చినట్లుగానే ఆ కోతికి కూడా లంచం ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తిరిగి ఇచ్చింది. ఇంతకీ ఆ కోతికి ఇచ్చిన లంచం ఏంటో తెలుసా ఫ్రూటీ కూల్ డ్రింక్. ఇంతకీ ఏం జరిగిందంటే.. బృందావనంలోని బాంకే బిహారి మందిర్ వెళ్లే వీధిలో జిల్లా కలెక్టర్ నవనీత్ చాహల్ ఇతర అధికారులతో కలిసి వెళ్తున్నారు.


 ఆయన అధికారులతో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో ఒక కోతి వచ్చి ఆయన భుజంపై కూర్చుంది. ఇకపోతే చూసి భయపడకుండా అలాగే ఫోన్ మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇంతలో కలెక్టర్ చూస్తుండగానే ఆయన జేబులో ఉన్న కళ్ళజోడు తీసుకొని పక్కనే ఉన్న ఇంటి పైకి వెళ్లి కూర్చుంది ఆ కోతి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆ కోతి వద్ద నుంచి కళ్ళజోడు తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించిన కుదరలేదు. చివరికి రెండు ఫ్రూటీ ప్యాకెట్లు కోతి వైపు విసరగా అది కళ్ళజోడును కింద పడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: