రైలు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎంతో మంచి వాళ్ళలా ప్రవర్తించే వారు చివరికి అందినకాడికి దోచుకోవడం చేస్తూ ఉంటారు. ఇలాంటి తరహా ఘటనలో నేటి రోజుల్లో చాలానే వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే.  అయితే ఇటీవలే కాలంలో అయితే చోరీలకు పాల్పడేందుకు దొంగలు కొత్త మార్గాలను ఎంచుకుంటు ఉండడం గమనార్హం. ట్రైన్ కాస్త స్లో అయ్యిందంటే చాలు దొంగలు కిటికీలోనుంచి చేతులు లోపలికి పెట్టి ఏది దొరికితే అది ఎత్తుకు పోవడం లాంటివి చేస్తూ ఉంటారు.


 అయితే ఇక్కడ ఒక దొంగ ఇలాగే చేయబోయాడు. రైలు కదులుతున్న సమయంలో కిటికీలోనుంచి చేతులు పెట్టి సెల్ఫోన్ చోరీ చేయడానికి  చేయడానికి ప్రయత్నించాడు. కానీ ప్రయాణికుడు అప్రమత్తం కావడంతో చివరికి ఆ దొంగ ప్రాణాల మీదికి వచ్చింది. కొన్ని నిమిషాల పాటు నరకయాతన అనుభవించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా ఎవరైనా దొంగ చోరీ చేస్తూ పట్టుబడిన సమయంలో ప్లీజ్ వదిలేయండి అని బ్రతిమిలాడుతాడు.  కానీ ఇక్కడ మాత్రం నన్ను వదిలి పెట్టొద్దు అంటూ ప్రయాణికులను వేడుకున్నాడు.


 బీహార్లోని బెగుసరాయ్ నుంచి ఖాగారియా కి వెళ్తున్న రైలు సాహెబ్ పూర్ కమల్ స్టేషన్ దగ్గర ఆగింది. కాసేపటికి రైలు మళ్ళీ స్టార్ట్ అయింది.  వెంటనే ఒక దొంగ రైలు కిటికీ నుంచి ప్రయాణికుడి ఫోన్ ఫోన్ చోరీ చేయడానికి  ప్రయత్నించాడు. అప్రమత్తంగా ఉన్న ప్రయాణికుడు దొంగ చేతులు గట్టిగా పట్టుకున్నాడు.  రైలు వేగం పెరిగింది.  ఇక ప్రయాణికులు మాత్రం ఆ దొంగను అలాగే పట్టుకున్నారు. దీంతో రైలు తో పాటే వేలాడుతూ వచ్చాడు.  దీంతో తనను వదిలి పెట్టవద్దని తన ప్రాణాలను కాపాడాలి అంటూ ప్రయాణికులను వేడుకున్నాడు దొంగ.  దీంతో ఇక దొంగతనానికి ప్రయత్నించి చివరికి రైలు బయట వేలాడుతూ నరకయాతన అనుభవించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: