గతంలో ఓ బాలిక చెవిలో పాము ప్రవేశించిందని ఇంకా దానిని అతి కష్టం మీద బయటకు తీసినట్లు  ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఇప్పుడు పూర్తిగా ఆశ్చర్యపరిచే సంఘటన ఇంకొకటి మరోసారి తెరపైకి వచ్చి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అయితే ఈసారి మాత్రం ఏకంగా ఓ మహిళ నోటిలోకి నుంచి పాముని బయటకు తీసుకున్న ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఎవరైనా ఖచ్చితంగా ఒక రేంజిలో షాక్ అవ్వడం ఖాయం.నిజానికి ఆ మహిళ గాఢ నిద్రలో ఉంది.. ఎంతగా అంటే బహుశా ఆమె కుంభకర్ణుడి అవతారం ఏమో అనేంతలా..ఆ రేంజ్ లో ఆమె నిద్రపోతుంది.. ఈ సమయంలోనే ఒక పెద్ద పాము ఆమె నోటిలోకి ప్రవేశించింది.. ఆ తర్వాత డాక్టర్ ఆ పాముని ఆ మహిళ నోటి నుంచి చాలా కష్టంతో బయటకు తీశారు. మహిళ నోటి నుండి పామును తీసిన తరువాత.. ఆ పాము తనని కాటేస్తుందే అని డాక్టర్ తెగ భయపడింది కూడా..సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ మహిళ అపస్మారక స్థితిలో ఉంది. 


అయితే డాక్టర్ ఆమె నోటిలో ఒక లైట్ తో వెలుగుతున్న కర్రను పంపించారు. ఆ కర్ర సహాయంతో డాక్టర్ పామును బయటకు తీయడానికి ట్రై చేశారు. ఇక క్రమంగా ఆ మహిళ నోటి నుంచి పామును డాక్టర్ కర్ర సాయంతో బయటకు తీయగా.. ఆ పాము పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఆ డాక్టర్ తనను కాటేస్తుందేమో అనుకున్నట్లున్నారు.. దెబ్బకు భయంతో వెనక్కి అడుగు వేశారు.ఈ భయంకరమైన వీడియో  ట్విట్టర్‌లో @FascinateFlix అనే IDలో షేర్ చేశారు.ఆ మహిళ నిద్రిస్తున్నప్పుడు, నాలుగు అడుగుల పాము ఆమె నోటిలోకి వెల్లిందని .. దానిని డాక్టర్ బయటకు తీశారని  క్యాప్షన్ లో తెలిపారు.కేవలం 11 సెకన్ల ఈ వీడియోను ఏకంగా 1 లక్షా 57 వేల మందికి పైగా చూడగా,మొత్తం 6 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. ఇంకా అదే సమయంలో, ఈ వీడియోను చూసిన ప్రజలు భిన్నమైన రియాక్షన్లు ఇచ్చారు. ఈ వీడియోని చూసి, నిద్రిస్తున్న మహిళ నోటిలోకి పాము ఎలా ప్రవేశించిందో తెలుసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అసలు ఆమె అంతగా నిద్రపోతున్నందుకు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: