మనుషుల శరీరాలలో వింత మార్పులను ప్రపంచ రికార్డులు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా వెలుగులోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే అత్యంత పొడవైన మనిషి నుంచి అతి తక్కువ ఎత్తుకలిగిన పొట్టి మనిషి వరకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సృష్టిస్తుంటారు..అరదైన వాటిని రికార్డులోకి ఎక్కిస్తారు అని తెలిసిందే..ఇప్పటికే ఎంతో మంది ఇలా గిన్నిస్ లో చోటు దక్కించుకున్నారు.అయితే, అత్యంత పొడవైన ముక్కు రికార్డు ఎవరిది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కాదా.. కానీ, అలాంటి వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత పొడవైన ముక్కు కలిగిన ఆ వ్యక్తి ఇప్పుడు ప్రపంచ రికార్డులో తన పేరును చెక్కించుకోగలిగాడు. అతడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఇంగ్లీష్ సర్కస్ ప్రదర్శకుడి ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా వరల్డ్‌ రికార్డ్‌ గుర్తించింది. వాస్తవానికి ఈ రికార్డు గతంలో 18వ శతాబ్దంలో నివసించిన వ్యక్తికి చెందినది. థామస్ వాడర్స్ అనే ఆంగ్ల సర్కస్ ప్రదర్శనకారుడు.. దీనిని థామస్ వాడ్‌హౌస్ అని కూడా పిలుస్తారు. అతను 19 సెంటీమీటర్ల (7.5 అంగుళాలు) పొడవు గల ముక్కును కలిగి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా మరణానంతరం గుర్తించబడ్డాడు.


హిస్టారిక్ విడోస్ అనే ట్విట్టర్ పేజీ నవంబర్ 12 న ఒక చిత్రంతో పాటు ఆ మనిషికి సంబంధించి అద్భుతమైన కథను పోస్ట్ చేసింది. రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో అతని మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్ ప్రకారం 1770లలో ఇంగ్లండ్‌లో నివసించేవాడని తెలిసింది. అసాధారణ రూపంతో అతడు సర్కస్‌లో సభ్యుడిగా చేరాడు. థామస్ వెడ్డర్స్ 19 సెం.మీ (7.5 అంగుళాలు) పొడవైన ముక్కును కలిగి ఉన్న చారిత్రక ఖాతాలు ఉన్నాయి..ఈ ముక్కు వ్యక్తి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.చాలా మంది వినియోగదారులు అతనిని యానిమేటెడ్ షో స్పాంజ్‌బాబ్ స్క్వేర్‌ప్యాంట్స్‌లో కనిపించే కల్పిత పాత్ర స్క్విడ్‌వర్డ్ టెన్టకిల్స్‌తో పోల్చారు..ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధమైన కామెంట్ తో పోస్ట్ చేశారు.మొత్తానికి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: