చాలామంది కూడా స్ట్రీట్ ఫుడ్ ని అమితాంగా ఇష్టపడతారు. చిరుతిండి సాధారణంగా ప్రతిచోటా దొరుకుతుంది. ముఖ్యంగా ఈ స్ట్రీట్ ఫుడ్ లో భేల్ పూరి, పానీ పూరి, ఛాట్, సమోసా వంటి అనేక రకాలైన నోరూరించే ఫుడ్స్ ఉన్నాయి.వీటిల్లో  పానీపూరి చాలా ఫేమస్.. దీనిని చాలా మంది ఆహారప్రియులు చాలా ఇష్టంగా తింటారు. అయితే పానీ పూరి, దహి పూరి ఇంకా స్వీట్ పూరి వంటి రకాలున్నాయి. అయినా కానీ వీటిని సరికొత్త ప్రయోగాలు చేస్తే మాత్రం పెద్దగా స్ట్రీట్ ఫుడ్ ప్రియులు అంగీకరించరు.. అంతేకాదు అటువంటి వంటకాలను తయారు చేస్తున్నవారిని చూస్తే వెంటనే చిరాకు పడతారు కూడా.. తాజాగా ఓ వ్యక్తి థమ్స్ అప్‌తో పానీపూరీని రెడీ చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ థమ్స్ అప్‌తో తయారు చేసిన పానీపూరీని టేస్ట్ చేసి చాలా బాగుంది అని కితాబిచ్చింది. 


అయినా కూడా నెటిజన్లు తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు..ఓ ట్విటర్‌ యూజర్‌ ఈ వైరల్ వీడియోను పోస్ట్‌ చేశారు. "పానీ పూరీ ప్రేమికులారా.. ఇదిగో థంప్స్ అప్ పానీ పూరీని ప్రదర్శిస్తున్నా అంటూ థంబ్స్ గుర్తుతో మీ ప్రేమను తేలియజేయండి.. అని వీడియోతో పాటు కామెంట్ కూడా జత చేశారు.ఈ వైరల్ వైరల్ వీడియోలో డిష్ రెడీ చేయడానికి మనిషి నీటికి బదులుగా థమ్స్ అప్‌ని ఎలా ఉపయోగించాలో ఆ క్లిప్ లో చూపించారు. ఇలా చేయడం వలన పానీ పూరికి ఉపయోగించే పానీయం రుచిని మెరుగుపరచడానికి చాలా మసాలా దినుసులను కూడా అందులో కలిపాడు. ఒక మహిళ ఆ వంటకం రుచి చూసి..తనకు బాగా నచ్చిందని చెప్పింది.ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.ఇక మీరు ఈ వీడియో చూసి మీ అభిప్రాయం కామెంట్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: