అడవిలో ఉన్న ఏ జంతువైనా సరే సింహాన్ని చూసింది అంటే గజగజ వనికి పోవాల్సిందే . ప్రాణభయంతో పరుగులు తీయాల్సిందే. కాదు కూడదు అని సింహానికి ఎదురు వెళ్తే ఇక ఆ రోజే ఆ జంతువుకి చివరి రోజు అవుతుంది. ఇక ఈ భూమి మీద నూకల బాకీ తీరిపోతుంది
 ఎందుకంటే సింహం ఒక్కసారి పంజా విసిరిందంటే చాలు ఎంతటి జంతువైనా సరే ఇక సింహానికి ఆహారంగా మారిపోవాల్సిందే అని చెప్పాలి. అందుకే సింహాన్ని అడవికి రారాజు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇక అడవి దున్నలు అయితే సింహాన్ని దూరం నుంచి చూసిన కూడా ప్రాణ భయంతో పరుగులు పెడుతూ ఉంటాయి.


 కానీ ఇక్కడ ఒక దున్నపోతు మాత్రం ఏకంగా సింగిల్ గా సింహాల పై దాడి చేసేందుకు వచ్చింది. ఈ మాట వింటుంటే..  అడవి దున్న ఎంతో ధైర్యం చేసింది అనిపిస్తుంది కదా.. అయితే ఇలా ధైర్యం చేసి దూసుకురావడమే కాదు ఒక సింహాన్ని కనీసం లేచి నడవలేని విధంగా గాయపరిచింది. ఇక చుట్టూ సింహాలు రౌండప్ చేస్తున్న భయపడకుండా రెచ్చిపోయింది ఆ దున్నపోతు. తన కొమ్ములతో ఏగేసి ఏగేసి మరి సింహాన్ని కుమ్మేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 నాన్న పందులే గుంపులుగా వస్తాయి కానీ సింహం సింగిల్ గా వస్తుంది అన్న డైలాగ్ను ఈ వీడియో చూసిన తర్వాత మార్చాల్సిందే అని మీరు కూడా అంటారు అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ పదుల సంఖ్యలో సింహాలు సేద తీరుతుండగా.. ఏదో పూనకం వచ్చినట్లుగానే దూసుకు వచ్చింది ఒక దున్నపోతు. గడ్డి పొదల్లో హాయిగా పడుకున్న సింహాల మందపై ఒక్కసారిగా అటాక్ చేసింది. ఈ క్రమంలోనే ఒక సింహం ఏకంగా దున్నను గమనించి అటాక్ చేద్దామని ఆ దున్న మీద పడిపోయింది. కానీ అక్కడ మాత్రం పూర్తిగా సీన్ రివర్స్ అయింది. తన పదునైన కొమ్ములతో వీర కుమ్ముడు కుమ్మేసింది అడవి దున్న. ఒకరకంగా చెప్పాలంటే సింహాన్ని సుస్సు పోయించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: