అడవుల్లో ఉండే అతి క్రూరమైన ప్రమాదకరమైన జంతువులలో పులులు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. సింహం అడవికి రారాజు అయితే ఇక సింహం తర్వాత ఆ స్థాయిలో బలం కలిగిన జంతువు పులి. అందుకే ఒక్కసారి పులి పంజా విసిరింది అంటే చాలు ఎంతటి జంతువు అయినా సరే దానికి ఆహారంగా మారిపోవాల్సిందే. అంత భయంకరంగా పులి వేటాడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అడవికి సమీపంలో ఉన్న గ్రామాల్లోకి పులులు వస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇకపోతే పులిని ఏదైనా జంతువు చూసింది అంటే చాలు ప్రాణ భయంతో పరుగులు పెడుతూ ఉంటుంది. అలాంటిది ఒక వీధి కుక్క పులిని చూస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంకేముంది వీధి కుక్క ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. ఎందుకంటే ఏకంగా పులిని చూస్తేనే భయపడి పారిపోయే ఒక కుక్క ఏకంగా పులి పిల్లలకు తల్లిగా మారి సంరక్షణ బాధ్యతలను తీసుకుంది. ఏకంగా తన పిల్లలకు పాలు ఇచ్చినట్లుగానే పులి పిల్లలకు పాలు ఇస్తుంది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక మరోవైపు అటు పులి పిల్లలు క్రూర మృగాలు అయినప్పటికీ ఇక తల్లిగా బాధ్యతలు తీసుకొని పాలు ఇచ్చి లాలిస్తున్న కుక్కను అవి ఏమీ చేయకపోవడం.. ఏకంగా తల్లిదగ్గర పాలు తాగినట్లుగానే ఆ పులి పిల్లలన్ని కూడా కుక్క దగ్గర పాలు తాగుతూ ఉన్నాయ్. అంతేకాదు రెండు పులి పిల్లలు పాలు తాగేటప్పుడు కొట్టుకుంటూ ఉంటే ఇక ఆ తల్లి వాటిని వారించేందుకు ఒక పులిపై పడి ఆపుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా.. ఇది చూసి నేటిజన్స్ అందరూ కూడా ఫిదా అవుతున్నారు. అమ్మ ప్రేమ అంత గొప్పది.. అమ్మ ప్రేమ ముందు జాతి వైరం కూడా  పటా పంచలు కావాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: