ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటు లోకి వచ్చిన నేపథ్యం లో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలో అర చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తెలుసుకో గలుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమం లోనే ప్రతిరోజు ఎన్నో రకాల ఘటనలు సోషల్ మీడియాలో వెలుగు లోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అడవుల్లో ఉండే జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే ఇంటర్నెట్ ను షేక్ చేస్తూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి తరహా వీడియోలు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి.



 అయితే అచ్చం మనుషుల్లో ఉన్న మాదిరిగానే అటు అడవుల్లో ఉండే జంతువుల మధ్య ఉండే ప్రేమ ఆప్యాయలకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఒక చిరుత పులి పిల్ల దాని తల్లి దగ్గర గారాభం చేస్తూ ఉన్న వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. మనుషులైనా జంతువులైనా సరే తల్లి దగ్గర ఏ పిల్లలైనా గారాబం చేయాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.


 ఇంతకీ ప్రస్తుతం వైరల్ గా మారిపోయిన వీడియోలో ఏముందంటే.. ఒక చిరుత పులి హాయిగా పడుకుని సేద తీరుతూ ఉంటుంది. అచ్చంగా తల్లి పడుకున్నప్పుడు.. ఇక  పిల్లలు  గారాభం చేస్తూ విసిగించినట్లుగానే అటు చిరుత పులి పిల్ల కూడా తల్లిని అలాగే విసిగించడం మొదలుపెట్టింది. తోకను కొరకడంతో ఇక తల్లి ఒక్కసారిగా తన బిడ్డను దగ్గరికి తీసుకుంది. దీంతో ఇక తల్లి ఒడిలో పిల్ల చిరుత ఎంతో గారాబం చేస్తూ ఒదిగిపోయింది. ఇది చూసి అందరూ ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: