సాధారణంగా తుఫాన్లు వచ్చే ముందు సముద్రంలో లేదా నదులలో భారీగా సుడిగుండాలు ఏర్పడ్డాయి అని అటు వాతావరణ శాఖ అధికారులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అయితే ఇప్పటివరకు సుడిగుండాల గురించి వినడమే కానీ దాదాపు ఎవ్వరు చూసి ఉండరు అని చెప్పాలి. ఒకవేళ చూసినా ఇక ఎక్కడో దూరంలో సుడిగుండం ఏర్పడితే కిలోమీటర్ల దూరం నుంచి వీడియో తీస్తే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత చూసిన వారే ఉండవచ్చు. కానీ నీరు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక సుడిగుండాలు ఏర్పడినప్పుడు అంతే భయంకరంగా ఉంటుంది అన్న విషయానికి నిదర్శనంగా మారింది ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో.



 ఏకంగా నదిలో ఏర్పడిన ఒక భయంకరమైన సుడిగుండాన్ని కొంతమంది ప్రాణాలను పణంగా పెట్టి చాలా దగ్గర నుంచి తీసిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఎక్కువగా అటు నదులలో సుడిగుండాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ప్రపంచంలో ఇలా సుడిగుండాలు ఎక్కువగా ఏర్పడే కొన్ని నదులు కూడా ఉన్నాయి అని చెప్పాలి. అలాంటివి నదికి సంబంధించిన వీడియోనే ఇలా ట్విటర్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇలా ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియో బ్రిటిష్ కొలంబియాకు చెందిన నదిలోనిది అన్నది తెలుస్తుంది.



 అయితే ఇలా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియో చూడడానికే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఇంత భయంకరమైన సుడిగుండాన్ని బోట్లో వెళ్తున్న వ్యక్తులు ఆ సుడిగుండం చుట్టూ గిర్రున తిరుగుతూ.. ఇక వీడియో తీయడం మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అయితే ఇక ఈ సుడిగుండాన్ని వీడియో తీస్తున్న సమయంలో ఏ మాత్రం తేడా వచ్చినా కూడా బోట్ సుడిగుండంలో చిక్కుకొని పరిస్థితి బీభత్సంగా ఉండేది అనడంలో సందేహం లేదు. ఇలా వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తుంటే మాత్రం స్వయంగా మన కళ్ళతో లైవ్ లో సుడిగుండం వీక్షించినంత భయం మనసులో కలుగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: