భారతదేశంలో ఎక్కువగా వరి పబడుతుంది. అందుకే మన దేశంలో వారి ధాన్యాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వరి ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల దిగుబడి ఎక్కువగా వస్తుంది.  అందువల్ల రైతులు ఎంత వరి పండిస్తే... అంతా ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. భారత దేశంలో ఉత్పత్తి కి తగినంతగా వినియోగం కూడా తగ్గింది..విదేశాలకు పంపించే ఎగుమతులు కూడా బాగా తగ్గాయి. దానికి కారణం ఆయా దేశాల్లో పెరుగుతున్న వ్యవసాయ విధానాలు. 

 

 

మనదేశంలో చాలా బియ్యం నిల్వలు ఉన్నాయి.  దాదాపు 7 లక్షల టన్నుల పైగా బియ్యం నిలవెలు ఉన్నాయని అంచనా..
దేశంలో బియ్యంతోపాటూ... గోధుమ, నూకలు, గడ్డి, తవుడు, చిట్టు వంటివి కావాల్సిన దాని కంటే ఎక్కువే ఉన్నాయి. వచ్చే మూడేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయి. వాటిని వృథా చెయ్యకుండా... వాటి నుంచి మొలాసిస్, బీరును ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇలా బీరు ఉత్పత్తి చెయ్యడం ద్వారా... రైతుల దిగుబడులను కొన్నట్లు అవుతుంది. అలాగే వృథా నిల్వలను వాడుకున్నట్లు అవుతుంది. అదే సమయంలో... దేశ పారిశ్రామిక రంగానికి కూడా ఇది మేలు చేయనుంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బీరు ఉత్పత్తి చేపట్టినట్లు అవుతుంది.
మన దేశంలో బీరుకి మంచి గిరాకీ ఉంది. బీరు తాగేవాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువే.

 


ఒకప్పుడు భారత్‌లో ఇలాగే చెరకు, బియ్యంతో మొలాసెస్ తయారుచేసేవారు. దాన్ని విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పుడు ప్రపంచంలో మంచి నీళ్ల తర్వాత ప్రజలు ఎక్కువగా తాగుతున్నది బీరే. అందువల్ల ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఇండియాలో కూడా బీరు వాడకం ఎక్కువగానే ఉంది. బియ్యం, గోధుమలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్ని మరగబెట్టడం, పులియబెట్టడం ద్వారా... బీరును ఉత్పత్తి చేస్తారు. ఇది విజయవంతమైతే... వచ్చే రాబడుల ఆధారంగా... రైతుల ఉత్పత్తులకు మద్దతు ధరను మరింత పెంచడానికి కూడా వీలవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. నాణ్యమైన బీరును ఉత్పత్తి చేసేందుకు నాణ్యమైన బియ్యం, గోధుమల్ని పండించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అన్ని కుదిరితే బియ్యం తో బీరు తయారు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలా చేస్తే తక్కువ ధరలకే బీరు లభించే అవకాశం ఉందని పలువురు నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: