పొద్దు పొద్దున్నే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది టీ కాఫీ పాలు వంటివి తాగందే రోజు గడవదు. ఈ ప్రపంచంలో ఉదయం యం ఈ అలవాటు లేని వారిని వేళ్లమీద అ లెక్కించొచ్చు అంటే అతిశయోక్తి కాదు దాదాపుగా ప్రతి ఒక్కరికి ఉదయం కాపీ కానీ టీ కానీ పాలు కానీ తాగే అలవాటు ఉంటుంది. వీటి కావలసింది ముఖ్యంగా పాలు పాల కోసం గంటలు గంటలు లైన్ లో ఉంటూ తీసుకోవలసి వస్తుంది అయితే టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో లో పాలకు సంబంధించిన ఏటీఎంలో కూడా ఉండడం విశేషమని చెప్పుకోవచ్చు. పాల కోసం గంటలు గంటలు లైన్ లో ఉంటే కూడా పాలు దొరకని పరిస్థితి అయితే ఇప్పుడు ఆ సమస్య లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు బటన్ నొక్కితే పాలు వచ్చే ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. దీన్ని బట్టి చూస్తే టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. విదేశాల్లో ఎక్కువగా ఇటువంటి మిషన్ లను చూస్తూ ఉంటాము అయితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తొలిసారిగా మిల్క్ ఏటీఎంలను ప్రారంభించారు.చైర్మన్ లక్ష్మీనరసింహగుప్తా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌ పరిధిలో ఉన్న హస్తినాపురం డివిజన్‌ హనుమాన్‌నగర్‌ చౌరస్తాలో పాల సరఫరా ఏటీఎం కేంద్రం శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయంతో ఆ ప్రాంత ప్రజలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ మిషన్ ను చూసిన అక్కడి స్థానికులు ఇది ఎంతో ఉపయోగకరమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏటీఎంను వినియోగించాలనుకున్నవాళ్లు అవసరాల మేరకు అక్కడ ఉండే బటన్ నొక్కాల్సి ఉంటుంది. ఏటీఎం మిషన్‌లో లీటర్‌, అర లీటర్‌, పావు లీటర్‌ బటన్ ఏర్పాటు చేశారు. మనకు ఎన్నిపాలు కావాలంటే అన్నిపాలు బటన్ నొక్కగానే ఆ మేరకు ఒక పాత్రలోకి వస్తాయి

మరింత సమాచారం తెలుసుకోండి: