
ఈ కాలంలో మనం ఏదైనా జంతువులను చూస్తే చాలు హడలెత్తి బెంబేలెత్తిపోతుంటాము. కానీ జంతువులకు కూడా మనుషులపై ప్రేమానురాగాలు ఉంటాయి. అవి ఎవరినీ ఏమీ చేయవు కాకపోతే మన ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏనుగు ని చూసారా ? ఒకవేళ చూసి ఉంటే అది హాయిగా నిద్రించడం చూశారా.. ? ఒకవేళ ఒకటో రెండో నిద్రించడం మీరు చూసి ఉంటే ? అది పెద్దగా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేమిటంటే.. ఒక ఏనుగు కుటుంబం హాయిగా అడవిలో సేదతీరుతూ ఒక సీసీటీవీ కంట పడింది..అది ఎక్కడో ? ఏమిటో ?అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తమ మానసిక స్థితిని మరింత మెరుగుపరుచుకోవడం కోసం, ఒక ఏనుగు కుటుంబం హాయిగా నిద్రపోతోంది. ఇది కాస్త ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ కంట పడింది. సీసీటీవీ ద్వారా లభ్యమైన వీడియోను తీసి, ఆయన తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇందులో ఆ ఏనుగులు ఒక అడవిలో గాఢనిద్రలో మునిగిపోయినట్లు మనం చూడవచ్చు.
ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ మనతో ఇలా పంచుకున్నారు. ఇక్కడ హాయిగా నిద్రిస్తున్న ఏనుగు కుటుంబం ఈ రోజు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. సీసీటీవీ ద్వారా పంచుకున్న ఈ వీడియోలో ఏనుగులు ఒకదానికొకటి నిద్రిస్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. అయితే పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే ఏడు వేల మంది వీక్షించారు. 285 మంది రీట్వీట్లు కూడా చేశారు. ఏనుగులు ఎప్పుడూ అలా నిద్ర పోవడం చాలా వరకు ఎవరూ గమనించలేదు. అవి సాధారణంగా నిలబడే వుంటాయి. నేను చూసినంత వరకూ అవి రెండే పనులలో నిమగ్నమై వుంటాయి. ఒకటి తిండి తినడం, మరొకటి నిద్ర పోవడం. అయితే నిద్ర పోవడం అనేది ఎవరూ పెద్దగా గమనించలేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు..
ఈ విపత్కర పరిస్థితులలో మానవులు చేయలేని పనిని ఏనుగులు చేస్తున్నాయి. అంటే ఈ కరోనా భయం లో ఏ ఒక్కరు కూడా మనశాంతిగా నిద్ర పోవడం లేదు. కానీ ఇవి మాత్రం ప్రపంచంతో సంబంధం లేకుండా హాయిగా నిద్రపోతున్నాయి.l