
ఇటీవల కాలంలో ఎన్నో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఇలా జంతువులకు సంబంధించి ఏదైనా వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు జనాలు కూడా చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కి ఇచ్చిన క్యాప్షన్ చూసి అందరూ పగలబడి నవ్వుకుంతున్నారు అని చెప్పాలి. అంతే కాదు ఎంతో మందికి షేర్ సైతం చేస్తున్నారు. ఒక హిప్పోపొటామస్ సంబంధించిన వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది.
హిప్పోపొటామస్ ఒక చెరువులో హాయిగా సేదతీరుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ఇక అదే చెరువులో ఉన్న తాబేల్లు మొత్తం హిప్పోపొటామస్ శరీరం పైకి చేరుకుంటాయి. ఇక ఈ హిప్పో పైన ఉంటే ఎలాంటి కష్టం లేకుండా కొంచెం కూడా శ్రమ లేకుండా హాయిగా ప్రయాణం చేయవచ్చు అని తాబేల్లు ప్లాన్ చేస్తాయి. కానీ ఆ తర్వాత హిప్పోపొటామస్ అక్కడి నుంచి లేచి ముందుకు కదలడానికి ప్రయత్నిస్తుంది. దీంతో ఇక హిప్పో వీపు పై ఉన్న తాబేల్లు మొత్తం ఒక్కసారిగా చెరువులోకి పడిపోతాయి. అంతేకాదు ఇక ఈ హిప్పో వీపుపై ఇంకా మిగిలివున్న తాబేల్లు ఎంతో షాకింగ్ గా చూస్తూ ఉంటాయి. ఇలా ఉచిత రైడ్లు కొన్ని కొన్ని సార్లు ప్రమాదకరం కావచ్చు ఈ వీడియోనే దీనికి రుజువు అంటూ ఇక ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధారామన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వేరుగా మారిపోయింది.