చెన్నై లో వరుణుడి భీభత్సము వల్ల చెన్నై ప్రజలు ఇబ్బందులకు గురిఅవుతున్నారు. ఎక్కడ చూసినా వరదలతో వీధులు, దారులు కనిపిస్తున్నాయి. ఇళ్లల్లోకి నీళ్లు చేరి మనుషులు కూడా అందులో ఉండలేని పరిస్థితి ఏర్పడింది . గత నాలుగు రోజులుగా రాష్ట్రం లో కుండపోతగా వర్షాలు కురుస్తూవున్నాయి . చెన్నై ప్రజల జీవనం స్తంభించి పోయిందా అనిపించేలా తయారయింది . గురువారం కూడా తమిళనాడులో భారీగా వర్షాలు నమోదు అయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .



 IHG
టీపీ ఛత్రం ప్రాంతానికి చెందిన పోలీస్ అధికారి ఇన్స్పెక్టర్ రాజేశ్వరి చేసిన సాహసం సోషల్ మీడియాలో పలువురి ప్రశంసలకు దారితీసింది. టీపీ ఛత్రం లోని ఓ శ్మశానవాటిక పక్కన అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడివుండడం చూసి రాజేశ్వరి చలించి పోయింది. వెంటనే అతనిని కాపాడాలని నిశ్చయించుకుంది . వేరే ఆలోచనేలేకుండానే అతడిని తన భుజాలపై వేసుకుని హాస్పిటల్ లో చేర్పించే ప్రయత్నం చేసింది . అయితే ఆ యువకుడికి 8 ఏళ్ళు వుంటాయని సమాచారం , ఐతే పక్కనే ఉన్న వేరొక పోలీస్ అధికారి ఈ చిత్రాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మంచి స్పందన లభించింది . ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది .





ఈ వీడియో చుసిన నెటిజన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ  మహిళా పోలీస్‌ ధైర్యసాహసాలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కొందరు ఈ చర్య ద్వారా మీరు అనేకమందికి ఆదర్శంగా నిలిచారని పొగుడుతున్నారు. తమిళనాడులో ఇప్పటివరకు దాదాపుగా పన్నెండు మంది చనిపోయారు అని కుమార్ జయంత్ (రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ) తెలిపారు . బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి గురువారం రోజున తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ తీరా ప్రాంతాలను దాటుతుందని తెలుస్తూవుంది . ఈ కారణంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అయన పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: