ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ గురించి ఏ విషయం తెలియలన్నా దక్షిణ కొరియా, అమెరికా లాంటి దేశాలు రహస్యంగా రాబట్టిన విషయమే ప్రపంచానికి తెలియజేస్తాయి. కానీ ఉత్తర కొరియాలో  అక్కడ ఉండే మీడియా మాత్రం దేశ అధ్యక్షుడి గురించి ఎలాంటి వార్తలు రాయాలన్న పర్మిషన్ తీసుకోవాలి. అయితే ఇక్కడ దక్షిణ కొరియా చెప్పే విషయాలు అన్ని నిజమైనవి కావు. అందులో కొన్ని నిజాలు ఉంటాయి. కొన్ని అబద్దాలు ఉండొచ్చు. మరికొన్ని ఊహాగానాలతో విషయాలను బయటకు చెబుతుండొచ్చు.


ఇప్పుడు కూడా అలాంటి సంచలన వియమయే దక్షిణ కొరియా కిమ్ గురించి బయటపెట్టింది. అది నిజమా కాదా అన్నది ఉత్తర కొరియా నోరు విప్పితే గానీ తెలియదు. కానీ కిమ్ చెబితేనే అక్కడి మీడియా దాని గురించి మాట్లాడుతుంది.సౌత్ కొరియా చెప్పిన విషయం ఏమిటంటే కిమ్ కు కొత్త రోగం వచ్చిందని ఆయన ఉన్నట్లుండి నిద్రలోకి జారిపోతాడని చెప్పింది.


కిమ్ కు ఇలా జరుగుతుందని దక్షిణ కొరియా స్పై విభాగం కనిపెట్టిందని బ్లూమ్ బర్గ్ తన నివేదికలో తెలిపింది. దక్షిణ కొరియాకు ఉత్తర కొరియాకు అసలు పడని విషయం తెలిసిందే.  కిమ్ ఎక్కువగా మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురువుతోందని తెలిపింది. మత్తుకు బానిస కావడం వల్ల అతడు ఎప్పుడు నిద్ర పోతాడో ఎప్పుడు మేలుకుంటాడో తెలియని జబ్బుతో బాధపడుతున్నట్లు పేర్కొంది. ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు.


రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు అమెరికా చాలా సార్లు ఆరోపణలు చేసింది. కానీ పుతిన్ వాటిని పటాపంచలు చేస్తూ  ఏకంగా ఉక్రెయిన్ లోని మరియపోల్ లో పర్యటించి తానెంటో నిరూపించుకున్నాడు. అమెరికా వేసే నిందలకు తాను భయపడాల్సిన అవసరం లేదని  పుతిన్ ప్రకటించారు. మరి కిమ్ కూడా ఎలాంటి ఈ ఆరోపణలకు ఎలాంటి  సమాధానం చెబుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

KIM