
అయితే ఒకప్పుడు మొసళ్లు ఎలా దాడి చేస్తాయి.. వాటి కదలికలు ఎలా ఉంటాయి అన్న విషయం చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ విషయాలు అన్నింటిని ఎంతో సులభంగా తెలుసుకోగలుగుతున్నాడు ప్రతి మనిషి. అయితే కొన్ని కొన్ని సార్లు అటు అందరినీ భయాందోళనకు గురిచేసి వెన్నులో వణుకు పుట్టించే వీడియోలు కూడా తెరమీదకి వస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు మొసళ్లకు సంబంధించిన ఒక వీడియో ఇలాంటిదే ట్విట్టర్ వేదికగా చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఏకంగా భయంకరమైన మొసళ్లు భూమిని చీల్చుకుంటూ వచ్చాయి.
ఈ వీడియో చూసి నేటిజన్స్ హాడలిపోతున్నారు. ఒక గల్లీలో భూమికి పగుళ్లు కనిపిస్తాయి. అక్కడ సగభాగం లోపలికి మరో సగభాగం బయటకి ఉన్న మొసలి కనిపిస్తుంది. అయితే అటవీశాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు నాన తంటాలు పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే మరో మొసలి భూమిని చీల్చుకుంటూ బయటకు వస్తుంది. దీంతో దానిని చూసిన జనాలు ఒక్కసారిగా భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఎందుకంటే మరో మొసలి లోపల నుంచి వస్తుందని అక్కడున్న వారు ఎవరు కూడా ఊహించలేదు. అక్కడున్న వారందరిని అమాంతం మింగేద్దాం అనే రీతిలో ఆ మొసలి వేగంగా బయటికి వచ్చి దాడి చేయడానికి అటూ ఇటూ పరుగులు పెడుతుంది. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి.