
రాబోయే ఎలక్షన్ల దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం పలు రకాల పోస్ట్లను సైతం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇటీవలే తెలంగాణాలో వచ్చిన ఫలితాలు ఏపీలోనూ పునరావృతమవుతాయని బహిరంగ చర్చ ఏపీలో సాగుతోంది. ఏపీ సీఎం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని పలు రకాల పోస్టులను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నిరుద్యోగులను ప్రసన్న చేసుకునేందుకు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ సైతం విడుదల చేయడం జరిగింది. తాజాగా గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది
డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.. కొత్త సిలబస్ ప్రకారమే ఈ పోస్టులు జరగబోతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 331 ఎగ్జిక్యూట్ 566 non -ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.
ఈనెల 21వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.. ఈ ఉద్యోగాలకు స్క్రీన్ కి పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన జరగబోతున్నాయి.ఈ మేరకు నోటిఫికేషన్ లో తెలియజేయడం జరిగింది.. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు APPSC నిష్పత్తి ఆధారంగా మెయిన్స్ కు షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుందట.
మెయిన్ పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తారట.మెయిన్ ఎగ్జామ్ ఆధారంగే మెరిట్ అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫెషియన్స్ పరీక్ష నిర్వహిస్తారు..మెయిన్స్ పరీక్ష రెండు ఆఫ్లైన్ ఎగ్జామ్ లోనే నిర్వహిస్తున్నట్లు APPSC నోటిఫికేషన్ లో తెలియజేయడం జరిగింది. నిరుద్యోగులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం మంచిది.