
ట్రైన్ లోపలే కాదు ట్రైన్ బయట కూడా మొబైల్స్ ని కాల్ చేసేందుకు దొంగలు సరికొత్త మార్గాలను వెంచుకుంటూ ఉన్నారు. కొంతమంది ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీ దగ్గర కానీ లేకపోతే ట్రైన్ ఎక్కే మెట్ల మీద కానీ కూర్చొని ప్రయాణిస్తూ ఉంటారు. అయితే అలా చేయడం కూడా ఇప్పుడు ప్రమాదమే అన్నట్టుగా అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ వీడియో ప్రకారం ఒక రైలు వేగంగా ప్రయాణిస్తూ ఉంటే ఆ సమయంలో ఒక వ్యక్తి రైలు పట్టాల వద్ద కర్ర పట్టుకొని మరి నిలుచున్నారు.
ఎవరైతే మొబైల్ ఫోన్ పట్టుకొని మరి ట్రైన్ డోర్ దగ్గర నిలబడి చూస్తున్న వారిని టార్గెట్ చేస్తే వాళ్లను చేతిపై కర్రతో కొడుతూ వాళ్ల చేతిలో ఉన్న మొబైల్ ని సైతం కింద పడేలా చేసి ఆ మొబైల్ ని తీసుకొని పారిపోవడమే లక్ష్యంగా అన్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఈ వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. అయితే ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది.. దీంతో ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలంటూ పలువురు కామెంట్స్ చేస్తూ వైరల్ గా చేస్తున్నారు.