ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో అబార్షన్ చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది అంటూ అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా కొంతమంది తల్లిదండ్రులు కడుపులోని బిడ్డను కడుపులోనే చంపేస్తున్నారని అధికారులు మండిపడుతున్నారు. తాజాగా బయటపడిన అధ్యయనాల ప్రకారం, ఇండియాలో చాలా మంది కడుపులోని బిడ్డను కడుపులోనే చంపేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో అబార్షన్ల సంఖ్య దాదాపు మూడు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో 367% పెరుగుదల నమోదు కాగా, తెలంగాణలో అది 917% పెరిగింది. ఈ పెరుగుదల చాలా ఆందోళన కలిగించే అంశమని అధికారులు పేర్కొన్నారు.


తెలంగాణలో 2020-21లో 15,78 అబార్షన్లు నమోదు కాగా, ఆ సంఖ్య 2024-25 నాటికి 16,059కి చేరింది. ఇది చాలా ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2024 నాటికి 20,576 అబార్షన్లు నమోదు అయినట్లు వెల్లడైంది.
ఈ గణాంకాలు సమాజంలో ఆరోగ్య సదుపాయాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులు, ప్రజల అవగాహన వంటి అంశాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. దేశంలో అబార్షన్లు పెరగడానికి ముఖ్య కారణం యువత ఎక్కువగా ఉద్యోగాలపై దృష్టి పెట్టడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. చాలామంది పెళ్లయి నాలుగేళ్లు, ఐదేళ్లు అయినా కూడా ఒక బిడ్డను కనడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఒక బిడ్డను పెంచి పెద్ద చేయాలంటే కోట్లు ఖర్చు అవుతుంది. భార్యాభర్త ఇద్దరూ సంపాదిస్తేనే దానికి తగిన న్యాయం చేయగలరు. ఆ కారణంగానే చాలా మంది ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే కడుపులోని బిడ్డను కడుపులోనే చంపేస్తున్నారు.



మరికొంతమంది మొదటి ఆడపిల్ల పుట్టిందని, రెండోసారి కూడా ఆడపిల్ల పుడుతుందనే భయంతో అబార్షన్ చేస్తున్నారు. ఇంకొంతమంది అసలు పిల్లలను కనడానికే ఇష్టపడడం లేదు. మారిపోతున్న టెక్నాలజీ, పెరిగిపోతున్న ఫాస్ట్ కల్చర్ కారణంగా వారు మరింతగా ప్రభావితమవుతున్నారు. ఇది నిజంగా చింతించాల్సిన విషయం అని ప్రజలు చెబుతున్నారు. గతంలో మన పెద్దవాళ్లు ముగ్గురు – నలుగురు పిల్లలను కనేవారు. కానీ ఇప్పుడు ఒక బిడ్డను కనడానికే రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తోంది అంటూ సాధారణ ప్రజలు బాధపడుతున్నారు. ముఖ్యంగా భార్యాభర్త ఇద్దరూ జాబ్ చేస్తుండడం, తగిన జీతాలు రాకపోవడం, బిడ్డ పుడితే జాబ్ ఆపేయాల్సి వస్తుందనే భయం వంటివి మహిళలను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే అబార్షన్ చేయించుకునేలా చేస్తోంది అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గత ఐదు ఏళ్లలో తెలుగు రాష్ట్రాలలో అబార్షన్ల సంఖ్య పెరిగిపోయిందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ గణాంకాలను కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో సమర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: