
ఆలయ పూజారి కుంకుమ పూస్తూ ఒక మహిళ భక్తురాలతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని ఆలయం మేట్ల దగ్గర పూజారిని చుట్టుముట్టి మరి ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు ఏకంగా దాడి చేశారు. ఆ పూజారి తనను కొట్టవద్దు అంటూ దండం పెట్టినప్పటికీ ఆ మహిళా కాళ్లు మొక్కినప్పటికీ కూడా వదిలినట్లుగా కనిపించలేదు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది.ఇది నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన. ఈ సంఘటన గురించి పూజారి నాగభూషణ చార్య మీడియాతో కూడా మాట్లాడారు.
ఇలా మాట్లాడుతూ తనమీద దాడి జరిగింది తాను చేయని తప్పకు తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని ఆలయ సాంప్రదాయం ప్రకారమే తాను ప్రసాదం ఇవ్వడానికి మాకు ఒక విధానం ఉన్నది.. అందరికీ మంచి చేయాలని ఉద్దేశంతోనే తాను 25 ఏళ్లుగా ఈ సేవను చేస్తున్నాను ఎవరూ కూడా తన పట్ల ఇప్పటివరకు ఇలా చెడుగా ప్రవర్తించలేదు.. తాను గౌరవంగానే జీవించానని తెలిపారు. ఈ విషయం తమ ఉన్నత అధికారులకు కూడా తెలియజేశానని.. పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ విషయంలో తనకు న్యాయం జరగాలంటు అభ్యర్థించారు పూజారి. అయితే ఈ విషయం పైన ఇంకా అధికారికంగా కేసు నమోదు కాలేదని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.