
ఆకాశంలో వందల అడుగుల వేగంతో కిందికి దూకుతూ లీలా చూపిన ధైర్యం చూస్తే ఎవరికైనా గౌరవం కలగక మానదు. తాను చేసిన జంప్ తర్వాత ముఖంలో మెరిసిన చిరునవ్వు, ఆ క్షణాన్ని ఆస్వాదించిన తీరు అందరినీ ఇన్స్పైర్ చేసింది. రికార్డు సృష్టించిన 71 ఏళ్ల లేడీ .. ఈ ఫీట్ సాధించడం ద్వారా లీలా జోస్ 71 ఏళ్ల వయసులో స్కైడైవింగ్ చేసిన మహిళగా రికార్డు నెలకొల్పారు. కేరళ నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై తన ధైర్యాన్ని చూపించడంతో ఇప్పుడు ఆమె పేరు ప్రతి చోటా వినిపిస్తోంది.
అంతరిక్షమే లక్ష్యం! .. స్కైడైవింగ్ చేసి సంతృప్తి పడితే లీలా అయ్యేది కాదు. ఆమె కలలు ఇంకా ఎత్తులో ఉన్నాయి. తనకు భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్ళాలి అనే కోరిక ఉందని ఆమె చెప్పారు. ఈ వయసులో అంతరిక్ష ప్రయాణం అనుకోవడమే గట్టి సాహసం. ఆమె ఆ మాటలు విన్నవారికి నిజంగా షాక్‌తో పాటు గౌరవం కలిగింది. స్ఫూర్తి అందించే వ్యక్తిత్వం .. వయసు పెరిగిందని జీవితం ఆగిపోదు. ఎప్పుడైనా కొత్తగా మొదలుపెట్టవచ్చు, కొత్త కలలు కనవచ్చు అని లీలా జోస్ నిరూపించారు. ఆమె స్ఫూర్తి కేవలం పెద్దవారికి మాత్రమే కాదు, యువతకు కూడా.