టొమాటో చారు.. ఈ చారు గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఎంత రుచికరంగా ఉంటుంది అంటే చెప్పలేము. ఇంకా అమ్మ చేస్తే ఆ చారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అమ్మ చేసిన టొమాటో చారు మనకు ఎక్కడ దొరకదు. అమ్మ చేసిన అలాంటి టొమటో చారు ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. టొమటో చారుని చేసుకొని తినండి. 

 

కావలసిన పదార్ధాలు .. 


టొమాటోలు పెద్దవి - రెండు, 


నీళ్లు - నాలుగు కప్పులు, 


చింతపండు గుజ్జు - ఒక టేబుల్‌ స్పూన్‌, 


ఎండుమిర్చి - మూడు, 

 

పసుపు - చిటికెడు, 


వెల్లుల్లి రెబ్బలు - రెండు, 


కరివేపాకులు - రెండు రెమ్మలు, 


కొత్తిమీర తరుగు - కొంచెం, 


ఆవాలు - ఒక టీస్పూన్‌, 


జీలకర్ర - రెండు టీస్పూన్లు, 


మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, 


నూనె - రెండు టీస్పూన్లు, 


ఉప్పు - రుచికి తగినంత...

 
తయారీ విధానం.. 


టొమాటో ముక్కలు తరగాలి. టొమాటో ముక్కల్ని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోయాలి. అందులోనే పసుపు, చింతపండు గుజ్జు, మిరియాల పొడి, ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్ని ఓ మాదిరి మంట మీద పావు గంట నుంచి 20 నిమిషాలు ఉడికించాలి. లేదా టొమాటోలు ఉడికేంత వరకు ఉంచాలి. సాస్‌ పాన్‌ను స్టవ్‌ మీద పెట్టి నూనె వేడిచేయాలి. వేడెక్కిన నూనెలో ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు కరివేపాకులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. తయారుచేసుకున్న టొమాటో రసాన్ని కూడా కలపాలి. కొత్తిమీర తరుగుతో అలంకరించాలి. వేడివేడిగా ఈ చారును ఎపటైజర్‌గా భోజనానికి ముందు తాగొచ్చు లేదా వేడి వేడి అన్నంతో కలుపుకుని తినొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: