మొటిమల సమస్యతో బాధపడేవారు ఈ ప్యాక్‌ని రెగ్యులర్‌గా వేసుకుంటూ ఉండడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.ముందుగా కాకరకాయని పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా కలబంద గుజ్జు, పసుపు కలిపి చర్మ సమస్యలు, దురద సమస్యలు ఉన్నవారు ఆ ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా సమస్య తగ్గుతుంది. రెగ్యులర్‌గా ఇలా చేయడం వల్ల ముఖం మీద ఉన్న మచ్చలు తగ్గుతాయి.
కాకరకాయని తీసుకుని పేస్ట్‌లా చేయాలి. ఇందులో జాజికాయ పొడి, పెరుగు కలిపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖంపై ప్యాక్‌లా వేసుకుని ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని క్లీన్ చేయాలి. ఇలా వరుసగా కొన్ని రోజులు చేస్తుంటే మొటిమలు, మచ్చల సమస్య పూర్తిగా తగ్గుతుంది.అలాగే కాకరకాయ ముక్కలను నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిలో కాటన్ బాల్ ముంచి ముఖాన్ని క్లీన్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న ఎలాంటి మచ్చలైనా దూరం అవుతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి