ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక సంపూర్ణతను తీసుకువస్తుంది. మనకంటూ ఓ వ్యక్తి ఉన్నారు అనే భావన పెళ్లితో కలుగుతుంది. అందుకే.. వయసుకు వచ్చాక అందరూ పెళ్లి గురించే ఆలోచిస్తారు. అయితే.. ఆ పెళ్లి తర్వాత అందరి జీవితం ఆనందంగా ఉంటుందనే గ్యారెంటీ కూడా ఇవ్వలేం. కాగా కొందరి లైఫ్ ఆనందంగా సాగిపోతుంటే.. మరి కొందరికి మాత్రం నరకం కనిపిస్తుంటుంది. అంతేకాదు మరికొందరికి అయితే ఎప్పుడెప్పుడు ఈ వివాహ బంధాన్ని వదిలేద్దామా అనే భావన కలుగుతుంది. అయితే జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారికి మాత్రం వివాహాంలో కష్టాలనే ఎక్కువగా చూస్తారు అని ఉంది. మరి ఆ రాశులు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మేష  రాశి: మేష రాశివారికి విపరీతమైన కోపం ఉండటంతో ప్రతి చిన్న విషయానికే కోపంతో ఊగిపోవడమే కాక, ఎవరైనా రెచ్చగొడితే మాత్రం వీరిని ఆపడం ఎవరి తరమూ కాదు. ఇటువంటి తరుణంలో తమ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవ జరిగితే.. ఇక వారిని ఆపడం ఎవరి వల్లా కాదు. అయితే.. కోపం తగ్గిన తర్వాత మాత్రం తమ తప్పుని ఒప్పుకుంటారు. అయితే వారు కోపంలో అన్న మాటలు, చేసిన చేష్టలను మాత్రం భరించలేకపోవటం పాటు వారి మధ్య తేడాలు రావడం ఖాయం.

మిథున రాశి: మిథున రాశివారికి జీవితాంతం ఒక్కరితోనే కలిసి జీవించటం అనే కాన్సెప్ట్ నచ్చదు. అంతేకాదు వీరు తమ షెడ్యూల్‌తో బిజీగా ఉంటూ తమ జీవిత భాగస్వామి కోసం అసలు సమయాన్నికూడా  వెచ్చించ లేకపోవటంతో వారు ఒకరికొకరు దూరంగా ఉంటారు. అయితే ఈ రాశి వారు ఆ తర్వాత తమ తప్పుని ఒప్పుకునే ప్రయత్నం కూడా చేయరు.

కన్య రాశి: కన్య రాశివారు అన్ని విషయాల్లోను పర్ఫెక్ట్ ఉండాలనుకుంటు అందరూ కూడా అలానే ఉండాలని భావిస్తారు... దీనివల్ల వారి వివాహ బంధంలో సమస్యలు రావడంమొదలయ్యి వీరి సంసారం జీవితంలో దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాసి వారికీ కాస్త భయం ఎక్కువ ఉండటంతో తమ వాళ్ళ అవతలి వారికీ ఏదైనా ప్రాబ్లం కలుగుతందని వారు భయపడుతుంటారు. మరి అటువంటి తరుణంలోనే తమ జీవిత భాగస్వామిని కూడా దగ్గరకు రానివ్వరు. అందుకోసమే వారు సింగిల్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇలాగే దూరంగా ఉంచడం తమ పార్ట్ నర్ కి నచ్చకపోవడం వల్ల.. వారి సంసారం జీవితాల్లో రకరకాల విభేదాలు రావడం మొదలయ్యే అవకాశం కచ్చితంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: