ఎస్‌యూవీ స్పెషలిస్ట్ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా గడచిన 2020 వ సంవత్సరంలో విడుదల చేసిన కొత్త తరం థార్ ఎస్‌యూవీకి మార్కెట్లో చాలా మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసినదే. మహీంద్రా థార్ ఎస్‌యూవీ కార్ కోసం ఉన్న భారీ వెయిటింగ్ పీరియడే దీని సక్సెస్ ను సూచిస్తుంది. ప్రస్తుతం, ఈ మోడల్ 3-డోర్ ఇంకా 4-సీటర్ వెర్షన్ గా మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, కంపెనీ ఇందులో 5-డోర్ వెర్షన్ ను అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయించింది. కొత్త 5-డోర్ థార్ ఎస్‌యూవీ కార్ ని మహీంద్రా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ మోడల్ ఆధారంగా తయారు చేయనున్నట్లు మహీంద్రా కంపెనీ తెలిపింది.ఇక మహీంద్రా థార్ రాబోయే 5-డోర్ల వేరియంట్ తాము ఇటీవలే ప్రారంభించబడిన స్కార్పియో-ఎన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని మహీంద్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇంకా ఆటోమోటివ్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ హెడ్ ఆర్ వేలుసామి ధృవీకరించారు. ఈ కొత్త థార్ రాకతో థార్ ఎస్‌యూవీ లైనప్ లో కొనుగోలుదారులకు మరిన్ని ఆప్షన్లు కూడా అందుబాటులోకి వస్తాయి.


ఇక అంతేకాకుండా, ఎస్‌యూవీ ఫేవరేట్ అయిన భారత మార్కెట్లోని వినియోగదారులకు ఈ 5-డోర్ వెర్షన్ థార్ చాలా ప్రాక్టికల్ గా కూడా ఉంటుంది.ఈ మహీంద్రా థార్ విషయానికి వస్తే, ప్రస్తుతం భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ కార్ లలో ఇది కూడా ఒకటి. ఇక ఈ ఎస్‌యూవీ ఐకానిక్ జీప్ స్టైలింగ్‌ ను కలిగి ఉండటమే కాకుండా, ఆఫ్టర్ మార్కెట్ లో కూడా ఇది అత్యధిక కస్టమైజేషన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. మహీంద్రా థార్ కార్ చివరి సారిగా 2010 వ సంవత్సరంలో మేజర్ గా అప్‌డేట్ చేయబడింది. ఇక ఆ తర్వాత సరిగ్గా పదేళ్లకు, అంటే 2020లో మహీంద్రా తమ కొత్త తరం థార్ ఎస్‌యూవీ కార్ ని ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా లేటెస్ట్ డిజైన్ ఇంకా ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: