టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లతో పాటుగా హాలీవుడ్ లోనూ నటించిన ఘనత హీరోయిన్ సిమ్రాన్ సొంతం. ఈమె హాలీవుడ్ లోని రెండు సినిమాల్లో నటించింది. ముంబై లో డిగ్రీ పూర్తి చేసిన ఈమె ఆ తరవాత మోడలింగ్ వైపు అడుగులు వేసి అటునుండి హిందీ చిత్రాల్లో నటించే అవకాశం అందుకుంది. అబ్బాయిగారి పెళ్లి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల తార అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అగ్ర హీరోల నుండి యంగ్ హీరోల వరకు అందరికీ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తూ బిజీ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. 1999 నుంచి 2004 వరకు కూడా తమిళ తెలుగు సినిమాలను చేసింది.

అయితే కెరియర్ పీక్స్ లో ఉన్న సమయం లోనే అనూహ్యంగా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను  2003లో ప్రేమ వివాహం చేసుకున్న సిమ్రాన్ వైవాహిక జీవితంలో అడుగు పెట్టి సినిమాలు బాగా తగ్గించారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టడంతో సినిమాలకు కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ 2008లో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ ఒక్క మగాడు, జాన్ అప్పారావు వంటి చిత్రాల్లో నటించి తన అదృష్టాన్ని మరోసారి చెక్ చేసుకుంది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో పలు టీవీ షోలలో కనిపించి అలరించింది.

అయితే ఇపుడు మళ్ళీ తెరపై మెరవాలనే ఆకాంక్షతో సరికొత్త పాత్రలో కనిపించడానికి రెడీ అయిపోయారు అని సమాచారం.  సిమ్రాన్ అండ్ సన్స్ అనే సొంత ప్రొడక్షన్ స్టూడియోను స్టార్ట్ చేసిన సిమ్రాన్ మళ్ళీ ఇపుడు సినిమాల్లో బిజీ అవ్వాలని అనుకుంటున్నారు. ఈ సంస్థ బాధ్యతలను భర్తను చూసుకోమని ఇపుడు సినిమాల్లో విలన్ గా నటించడానికి రెడీ అయ్యారు. కథ, పాత్ర నచ్చితే విలన్ గా నటించడానికి ఒకే అంటున్నారట సిమ్రాన్. ఇప్పటికే రెండు మూడు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం. అలా తన సంపాదనకు దారి చూసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: