బైక్ అంటే చాలా మందికి ఇష్టం.. గాలిలొ తిరగాలని, ఏదేదో అనుకుంటారు.. రకరకాలుగా చక్కర్లు కొట్టాలని అనుకుంటారు. అందుకే మార్కెట్ లో ఏదైనా బైక్ వస్తె యువత దానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. అయితే కంపెనీలు కూడా అలానే ప్లాన్ చేస్తారు.దూసుకెళ్లే స్పోర్ట్స్ బైక్స్ అంటే పడి చచ్చిపోతారు. అంతే కాకుండా సుదూర ప్రయాణాలు అంటే లాంగ్ డ్రైవ్ లను ఇష్టపడే వాళ్లకు మార్కెట్లో సరికొత్త మోటార్ సైకిళ్లు అందుబాటు లో ఉన్నాయి. ఇలాంటి బైక్స్ ను విడుదల చేయడంలో ముందు వరుస లో ఉన్న కంపెనీ కవాసాకి...



ఈ కంపెనీ కొత్త కొత్త బండిలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఇటీవల విడుదల అయ్యి మార్కెట్ లోకి విడుదల అయిన బండి మాత్రం కవాసాకి వల్కాన్ ఎస్. బీఎస్6 ప్రమాణాలకు అను గుణంగా మార్పులు చేసిన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది.. ఎంత సరి కొత్త ఆఫర్లు ఉన్నాయో అంతకు మించి రేటు కూడా ఉంది..  రూ.5.79 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. బీఎస్4 మోడల్ తో పోలిస్తే ఈ సరికొత్త 2021 కవాసాకి వల్కాన్ ఎస్ మోటార్ సైకిల్ ధర దాదాపు 30 వేల రూపాయల అధికంగా ఉంది.



ఆల్ న్యూ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ అయిన మెటాలిక్ ఫ్లాట్ రా గ్రేస్టోన్ కలర్లో ఉంది, అంతే కాకుండా ఫ్యూయల్ ట్యాంకు పై రెడ్ కలక్ యాక్సెంట్స్, అల్లాయ్ వీల్స్ తో యువతను అమాంతం కట్టిపడేస్తుంది.. ముఖ్యంగా ఈ బైక్ యొక్క ప్రత్యేకత అంటే కలర్, 14 లీటర్ల ఇంజన్ ట్యాంక్ ఉంటుంది. మృధువైన సీటింగ్ ఉండటం వల్ల లాంగ్ డ్రైవ్ లకు బాగా ఉపకరిస్తుంది. ఇంతకు ముందు మోడల్లో మాదిరే సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్, గేర్ ఇండికేటర్, ట్రిప్ మీటర్ తదితర ఫీచర్స్ కలిగి ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: