ప్రముఖ కంపెనీ టీవీఎస్ మోటార్ సైకిళ్ళు కంపెనీ మరో కొత్త బండిని మార్కెట్ లోకి విడుదల చేసింది . ఈ బండికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అన్ని పనులకూ అణకువగా ఉంటుంది. ధర కూడా తక్కువే అంటున్నారు. ఇకపోతే ఈ బైకు ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం.. టీవీఎస్ ఎక్స్ఎల్ 100 మోడల్లో విన్నర్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ఎడిషన్ లో అత్యాధునిక ఫీచర్లు, కాస్మటిక్ అప్డేట్లను ముందుకు తీసుకొచ్చింది.



 ఎక్స్ షోరూంలో ఈ 2021 టీవీఎస్ ఎక్స్ఎల్ విన్నర్ ఎడిషన్ ధర వచ్చేసి రూ.49,599లుగా సంస్థ నిర్దేశించింది.ఇకపోతే ఈ స్కూటర్ ప్రత్యేకతలు గురించి చాలానే చెప్పాలి.99.7సీసీ సింగిల్ సిలీండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 6000 ఆర్పీఎం వద్ద 4.3 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 3500 ఆర్పీఎం వద్ద 6.5 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కెర్బ్ వెయిట్ వచ్చేసి 89 కేజీలు. మ్యాక్జిమమ్ పేలోడ్ వచ్చేసి 130 కేజీలు. సస్పెన్షన్ సెటప్ వచ్చేసి ఫ్రంట్ వైపు హ్యాండిల్డ్ టెలిస్పోపిక్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు, 110 ఎంఎం డ్రమ్ బ్రేక్స్ ను కలిగి ఉన్నాయి.



టీవీఎస్ ఎక్స్ఎల్ 100 మోడల్ ప్రస్తుతం ఆరు వేరియంట్లలో లభిస్తుంది.కంఫర్ట్, హెవీడ్యూటీ, కంఫర్ట్ ఐ-టచ్ స్టార్ట్, హెవీ డ్యూట ఐ-టచ్ స్టార్ట్ అండ్ హెవీ డ్యూటీ ఐ-టచ్ స్టార్ట్ స్పెషల్ ఎడిషన్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ బైక్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ప్రారంభ ధర వచ్చేసి రూ.40,990లుగా కంపెనీ నిర్దేశించింది. నాలుగు దశాబ్దాల నుంచి వినియోగదారుల మన్ననలు అందుకుంటున్న ఈ స్కూటర్ లో ఎటువంటి సమస్య కూడా లేదు. గ్రామీణ ప్రాంతాల లో ఈ బైకును ఎక్కువగా వాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: