కరోనా సమయం లో ఆటో మొబైల్ కంపెనీ లు కొత్త వాహనాలను తయారు చేసిన కూడా వాటికి డిమాండ్ లేకుండా పోయింది. ఎటువంటి వ్యాపారాలు లేకపోవడం తో ద్విచక్ర వాహనాలను కొనేవారు లేకపోయారు. ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయలేకపోతున్న వారికి శుభవార్త.. ఎందుకంటే.. అతితక్కువ ధరల్లోనే మంచి మంచి ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయవచ్చు. అదికూడా సగం ధరలకే. ఈ స్కూటర్లు మంచి మైలేజీని ఇవ్వడంతోపాటు మన్నికగా ఉంటాయి.


హీరో మాస్ట్రో ఎస్టిడీ, హోండా యాక్టివా డిఎల్ఎక్స్ వంటి స్కూటర్లను కేవలం 25 వేల రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ల కొనుగోలు పై.. మీకు వారంటీ, RC బదిలీ వంటి అనేక ఫీచర్లు లభిస్తాయి. దీంతో బదిలీ కూడా సులభతరంగా మారుతుంది.. క్రెడ్ఆర్ వెబ్‌ సైట్‌లో సెకండ్ హ్యాండ్ బైక్‌లు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు సెకెండ్ హ్యాండ్ బైక్‌లను సైతం ఈ సైట్ ద్వారా కొనుగోలు చేస్తారు. వాటిని సైట్ నుంచి సెలెక్ట్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ కూడా చేయవచ్చు.

.
ఒకవేళ మీరు బైక్‌ను కొనుగోలు చేస్తే దాని ఆర్సీ, వారంటీ లాంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. క్రెడ్ఆర్ లో పేర్కొన్న దాని ప్రకారం.. 25,000, 25,500 రూపాయల ధరల్లోనే హీరో మాస్ట్రో STD, హోండా యాక్టివా Dlx స్కూటర్ల ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ స్కూటర్ల ఆన్‌రోడ్ ధరలకే లభిస్తాయి. సర్వీసింగ్ ‌తో పాటు ఆరు నెలల వారంటీ, ఆర్‌సి బదిలీ లాంటి సదుపాయం కూడా లభిస్తుంది. మీకు ఒకవేళ బైక్ నచ్చినట్లయితే.. వెబ్‌ సైట్‌లో మీ పేరు, మొబైల్ నంబర్, పిన్‌కోడ్ ఇచ్చి దాని గురించి మరింత సమాచారం పొందవచ్చు. దగ్గర లో ఉన్న షో రూం లలో కూడా చూడవచ్చు.. సరసమైన ధరలకే లభిస్తున్న ఈ స్కూటర్ల ను మీరు కూడా కొనుగోలు చేయవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: